మీరు ఒంటరిగా లేరు
కీర్తనల గ్రంథము 91:15 - "అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను". ఈ వాక్యం దేవుని అచంచలమైన ఉనికికి
మరియు విశ్వాసానికి శక్తివంతమైనదని గుర్తు చేస్తుందిి. కష్ట సమయాల్లో, జీవితం అతలాకుతలంగా అనిపించినప్పుడు,
దేవుడు మన కన్నీటి బాధను వినడమే కాకుండా, మన ప్రార్థనకు జవాబిస్తానని మనకు హామీ ఇస్తున్నాడు. ఆయన మనల్ని కష్టంలో విడిచిపెట్టడు - ఆయన మనతో పాటు నడుస్తాడు, చివరికి వమోచన కలిగించి, పోగొట్టుకున్న దానిని కూడా తిరిగి సమకూరుస్తాడు.
దేవుడు దగ్గరగా ఉన్నాడని
మరియు శ్రద్ధగలవాడని నమ్ముతూ ప్రార్థనలో మరింత అనుభవాలు పొందాలని ఈ వాక్యం మనల్ని ఆహ్వానిస్తుంది. ఆయన వాగ్దానం సమస్యను తొలగించడం గురించి మాత్రమే కాదు, దాని ద్వారా మనకు శుద్ధి చేసి అది మనల్ని బలపరచేదిగా ఉంది.
ఈరోజు, మీరు సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు, దీన్ని గుర్తుంచుకోండ - మీరు ఎప్పటికీ ఒంటరివారు కానే కాదు. దేవుణ్ణి ప్రార్థించండి, ఆయన ఖచ్చితమైన సమయంపై విశ్వసించండి. ఆయన సమాధానం ఇస్తాడు, ఇబ్బందుల్లో మిమ్మల్ని ఆదుకుంటాడు, మిమ్మల్ని విజయపథం వైపు నడిపిస్తాడు. ఆమెన్.
Quote : "ప్రతి పరీక్షలో, దేవుని సన్నిధి మీ బలం, ఆయన వాగ్దానం మీకు విడుదల."
You are never alone
Psalm 91:15 - "He will call on me, and I will answer him; I will be with him in trouble, I will deliver him and honor him." This verse is a powerful reminder of God’s unwavering presence and faithfulness. In moments of trouble, when life feels overwhelming, God assures us that He not only hears our cries but also responds. He doesn’t abandon us in difficulty—He walks through it with us, offering deliverance and even honor in the end.
This verse invites us to lean into prayer, trusting that God is near and attentive. His promise to deliver is not just about removing the problem but also about refining and strengthening us through it.
When you face challenges, remember this: you are never alone. Call on God, and trust His perfect timing. He will answer, sustain you in trouble, and lead you to victory. Amen.
Quote: "In every trial, God’s presence is your strength, and His promise is your deliverance."