అధిగమించే సామర్థ్యం
మీరు బలహీన పడుతున్నప్పుడు తిరిగి బలం ఎలా పొందుకోగలరు? అయితే ప్రభువు కోసం వేచి ఉండి, ఆయన శక్తిపై నమ్మకం ఉంచడం ద్వారా తిరిగి బలం పొందుకోగలం. అవును,
యెషయా 40:31 ఇలా ప్రకటిస్తుంది, "
యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు."
మన బలం మన సామర్థ్యాలలో కాదు, దేవునిపై ఆధారపడటంలో ఉంది అని ఈ వాక్యం మనకు గుర్తుచేస్తుంది. జీవితంలో మనం అలసిపోయినప్పుడు, ప్రభువుపై మన ఆశను ఉంచినప్పుడు, అది మనల్ని లోలోపల నుండి నూతనపరుస్తుంది. గ్రద్ద ఎత్తైన ఆకాశంలో సుడి
గాలులను చేధించి ఎగురుతున్నట్లే, మనం కూడా దేవుని అపరిమిత శక్తిపై ఆధారపడినప్పుడు సవాళ్లను అధిగమించగలము.
ఈరోజే కొంత సమయం ప్రభువు కోసం వెచ్చించండి. ఆయన మీ బలాన్ని పునరుద్ధరిస్తాడని నమ్మండి. పరీక్షల గుండా నడవడానికి ఓర్పును, వాటిని అధిగమించే సామర్థ్యాన్ని దయజేస్తాడు. ఆయనతో ఉంటే - అలసట ఆశ్చర్యంగా మారుతుంది, నిరాశ ఆశగా మారుతుంది. ఆమెన్.
Quote: మీ బలం విఫలం కావచ్చు, కానీ మీలోని దేవుని బలం ఎప్పటికీ విఫలం కాదు.
Don’t Give Up!
How can I find strength when I feel like giving up? By waiting on the Lord and trusting in His power. Yes, Isaiah 40:31 declares, "But those who hope in the Lord will renew their strength. They will soar on wings like eagles; they will run and not grow weary, they will walk and not be faint."
This verse reminds us that our strength isn’t found in our abilities but in our dependence on God. When life leaves us drained, placing our hope in the Lord renews us from within. Just like eagles soar effortlessly on unseen winds, we, too, can rise above challenges when we rely on God’s limitless power.
Take a moment today to pause and wait on the Lord. Trust that He will renew your strength, giving you the endurance to walk through trials and the power to soar above them. With Him, weariness becomes wonder, and despair turns into hope.
Quote: "Your strength may fail, but God’s strength in you never will."