నిజమైన స్వస్థతను నేను ఎక్కడ కనుగొనగలను? ప్రభువుపై విశ్వాసం, ఎందుకంటే ఆయనే స్వస్థపరచేవాడు పునరుద్ధరించేవాడు.
నిజమైన స్వస్థత
యిర్మియా 17:14
యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతనొందుదును, నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు.
శారీరక, భావోద్వేగ
మరియు ఆధ్యాత్మిక గాయాలు భారమైనవిగా అనిపించవచ్చు, వీటన్నిటికి సమాదానం దేవుడిచ్చే స్వస్థత. ఆయన స్వస్థత కేవలం నొప్పిని తొలగించడం గురించి కాదు—ఇది సంపూర్ణత వైపు నడిపించి పునరుద్ధరిస్తుంది. దేవునిపై మన నమ్మకాన్ని ఉంచినప్పుడు, ఆయన మన విరిగిన స్థితిని సరిచేయడమే కాకుండా మన బలాన్ని
మరియు నిరీక్షణను కూడా పునరుద్ధరిస్తాడు. ఆయన స్వస్థపరిచే శక్తి మన హృదయాల లోతైన ప్రదేశాలకు చేరుకుంటుంది, ఒకప్పుడు నొప్పి ఉన్న చోట నెమ్మదితో నింపుతుంది.
ఈరోజు, మీ బాధ, భయాలు
మరియు భారాలను దేవునికి అప్పగించండి. ఆయన ఆ పనిలోనే ఉన్నాడని తెలుసుకొని, మీరు ఇంకా చూడని విధంగా స్వస్థతను తీసుకువస్తాడని నమ్మండి. ఆయన పరిపూర్ణ సంపూర్ణ సమయంలో, మిమ్మల్ని పూర్తిగా స్వస్థపరచగలడని తెలుసుకుని ఆయన ప్రేమలో విశ్రాంతి పొందండి.ఆమెన్.
Quote: "దేవుని స్వస్థత కేవలం విరిగిన వాటిని సరిచేయదు కాని; అది సంపూర్ణతవైపు నడిపిస్తుంది."
Where can I find true healing? Trust in the Lord, for He is the one who heals and restores.
True Healing
Jeremiah 17:14 says, "Heal me, Lord, and I will be healed; save me, and I will be saved, for you are the one I praise."
Physical, emotional, and spiritual wounds can feel overwhelming, but God is the ultimate healer. His healing isn’t just about removing pain—it’s about restoring wholeness. When we place our trust in Him, He not only mends our brokenness but also renews our strength and hope. His healing power reaches the deepest places of our hearts, bringing peace where there was once pain.
Today, surrender your pain, fears, and burdens to God. Trust that He is at work, bringing healing in ways you may not yet see. Rest in His love, knowing that in His perfect time, He will restore you completely.
Quote: "God’s healing doesn’t just fix what’s broken; it makes you whole."