పై నుండి ప్రేమ | Love from Above


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

నేను నిజంగా ప్రేమించబడ్డానని నాకు ఎలా తెలుసు? మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే మనకోసం చనిపోవడానికి క్రీస్తును పంపడం ద్వారా దేవుడు తన ప్రేమను నిరూపించాడు.

పై నుండి ప్రేమ

రోమీయులకు 5:8 అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
దేవుని ప్రేమ - మన పనితీరు, మన గతం లేదా మన యోగ్యతపై ఆధారపడి ఉండదు. మనం పరిపూర్ణులయ్యే వరకు ఆయన వేచి ఉండలేదు - మన దయనీయ సమయంలో కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ ప్రేమకు - సిలువ అంతిమ రుజువు, దేవుడు మనల్ని కొలతకు మించి విలువైనదిగా భావిస్తాడని గ్రహించాలి. ఆయన ప్రేమ తాత్కాలికమైనది లేదా షరతులతో కూడినది కాదు; అది శాశ్వతమైనది మరియు కదిలించలేనిది. ఏ తప్పు, వైఫల్యం లేదా పోరాటం మనల్ని ఆయన ప్రేమ నుండి వేరు చేయలేవు.
ఈరోజు, దేవుడు మిమ్మల్ని గాఢంగా మరియు నిస్వార్ధంగా ప్రేమిస్తున్నాడనే నమ్మకంతో విశ్రాంతి తీసుకోండి. మీరు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా, ఆయన ప్రేమ స్థిరంగా ఉంటుంది. ఆయన ప్రేమ ద్వారా నెమ్మదిని, చిత్తాన్ని, నిరీక్షణను పొందే కృప దేవుడు దయజేయును గాక.

Quote: "దేవుని ప్రేమ సంపాదించుకోబడదు; మనం అనర్హులమైనా అది ఉచితంగా ఇవ్వబడుతుంది."


https://youtube.com/shorts/0RVLzMDCDV8

How do I know that I am truly loved? God proved His love by sending Christ to die for us while we were still sinners.

Love from Above

Romans 5:8 says, "But God demonstrates his own love for us in this: While we were still sinners, Christ died for us."
God’s love is not based on our performance, our past, or our worthiness. He didn’t wait for us to be perfect—He loved us at our worst. The cross is the ultimate proof of this love, showing that God values us beyond measure. His love is not temporary or conditional; it is eternal and unshakable. No mistake, failure, or struggle can separate us from His love.
Today, rest in the assurance that you are deeply and unconditionally loved by God. No matter where you’ve been or what you’ve done, His love remains constant. Let His love transform you, giving you peace, purpose, and hope.

Quote: "God’s love isn’t earned; it’s given freely, even when we don’t deserve it."