బైబిలు ప్రకారము హస్త ప్రయోగము పాపమా?


  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-masturbation-sin.html

బైబిలు హస్త ప్రయోగము గురించి ఎన్నడు ప్రస్ఫుటముగా ప్రస్తావించదు. అంతేకాదు, అది పాపమో కాదో కూడా పేర్కొనదు. హస్త ప్రయోగము విషయములో లేఖనములనుంచి అతి ఎక్కువగా చూపించబడే భాగము ఆదికాండము 38:9-10 లో వున్న ఓనాను కధాంశము. కొంతమంది భాష్యము ప్రకారము రేతస్సును నేలను విడువుట పాపము . ఏదిఏమైనప్పటికి ఆ వాక్య భాగము వివరిస్తుంది అదికాదు. ఎందుకంటే దేవుడు ఓనాను ఖండించింది రేతస్సును నేలమీద పడవేసినందుకు కాదుగాని తన అన్నకు సంతానము కలిగించుట ద్వారా తన భాధ్యతను నెరవేర్చనందుకు. ఈ వాక్య భాగము హస్త ప్రయోగము గురించి కాదుగాని కుటుంబ భాధ్యతను పరిపూర్ణముచేయుట విషయములో హస్త ప్రయోగము ఋజువు చేయటానికి గాను ప్రయోగించే రెండవ పాఠ్యభాగము మత్తయి 5:27-30. యేసుక్రీస్తు వ్యభిచార తలంపులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ పలికిన మాటలు నీ కుడిచెయ్యి నిన్నభ్యంతరపరచిన యెడల దాని నరికి నీ యొద్దనుండి పారవేయుము. హస్త ప్రయోగానికి ఈ పాఠ్యాంశములో నున్న విషయాలకు సంభంధమువున్నప్పటికి యేసయ్య హస్త ప్రయోగాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు అని అంటానికి అవకాశములేదు.

హస్త ప్రయోగము బైబిలులో ఎక్కడ ప్రస్ఫుటముగా చెప్పకపోయినప్పటికి హస్త ప్రయోగము చేయుటకు దారితీసేపనులు పాపముకాదు అనటానికి లేదు. మోహపు ఆలోచనలు, లైంగిక ప్రేరపణలు, అశల్లీల చిత్రాల ఫలితమే హస్త ప్రయోగము. ఈ సమస్యలను ఖచ్చితంగా ఆలోచించాలి. మోహపు అనైతిక ఆలోచనలను, అశల్లీల చిత్రాలను ప్రక్కకు పెట్టగలిగినట్లయితే హస్త ప్రయోగము సమస్యకానేరదు.

హస్త ప్రయోగము చేసిన చాలామంది అపరాధభావనకు గురిఅవుతారు. అయితే వాస్తవానికి పశ్చాతాప పడాల్సింది ఆ కార్యానికి వుపయోగించిన ప్రక్రియలే. కొన్ని బైబిలు సూత్రాలను లేక నియమాలను, హస్త ప్రయోగము అనే అంశానికి వర్తింపవచ్చు. ఉదా. ఎఫెసీ 5:3 లో మీలో జారత్వమేగాని, యే విధమైన అపవిత్రతయేగాని, లోభత్వమే గాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్దులకు తగినది మరియు 1 కొరింధి 10:31 కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి,అని పేర్కొంటుంది. ఈ క్రియాశీలకమైన పరీక్షను నెగ్గటం అసాధ్యం. బైబిలు భోధిస్తుంది రొమా 14:23 లో అనుమానించువాడు తినిన యెడల విశ్వాసము లేకుండ తినును, గనుక దోషియని తీర్పునొందును. విశ్వాసమూలము కానిది యేదో అది పాపము. ఏవిషయములోనైన దేవునికి మహమను ఇవ్వలేకపోతే ఆ పనిని చేయకూడదు. ఒక వ్యక్తి ఏ పనైనా పరిపూర్ణంగా దేవునికి ప్రీతికరమనైది అని అనిపించనట్లయితే అది పాపమని గుర్తించాలి. 1 కొరింధి 6:19-20 “మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుధ్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ గొప్ప సత్యము మన శరీరము విషయములో తీసుకొనే నిర్ణయంలపై ప్రభావం చూపాలి. ఈ నియమాల వెలుగులో హస్త ప్రయోగము పాపము అని నిర్థారించుట బైబిలు పరమైనదే. స్పష్టముగా హస్త ప్రయోగము దేవునికి మహిమకరమైనది కాదు, అది అవినీతిని వ్యత్యీకరించదు, మరియదేవుడు మన శరీరాలపై దేవునియొక్క ఆధిపత్యాని చూపడు.