దేవుడు ఈ దినాలలో అధ్భుతాలు ఇంకను చేయుచున్నాడా అని ప్రశ్నించటం సబబు కాదని మొదటిగా గుర్తించుకోవాల్సింది. అది అవివేకము మరియు బైబిలుపరమైనది కాదు, దేవుడు ప్రజలను స్వస్థపరచడని, ప్రజలతో మాట్లాడడని, అధ్భుత సూచకక్రియలు చేయడని , ఆశ్చర్యాలు చేయడని అనుకోవటం. మనం ప్రశ్నించవలసిందేటంటే 1కొరింథీ 12-14 లో వివరించబడినరీతిగా , ఆత్మచే జరిగే అధ్భుతక్రియలు ఇంకా మన సంఘాలలో చురుకుగా పనిచేయుచున్నావా లేదా అనేది. ఇది ఒకనికి పరిశుధ్ధాత్ముడు ఆత్మీయవరంను అనుగ్రహిస్తాడా లేదా అనేది కాదు. ప్రశ్న ఏంటంటే పరిశుధ్ధాత్ముడు ఈ దినాలలో ఇంకా అధ్భుతవరాలు నిర్వహిస్తున్నాడా? అన్నిటికన్నా మనం మొత్తంగా గుర్తించాల్సింది పరిశుధ్ధాత్ముడు ఆయన చిత్తము ప్రకారము ఆత్మీయవరాలు నిర్వహించుటకు సమర్థుడు ( 1 కొరింథీ 12: 7-11).
అపోస్తలుల కార్యములు, పత్రికలలో ఎక్కువశాతములో అధ్భుతాలన్ని అపోస్తలులద్వారా వారి సహచరుల ద్వార జరిగినవి. పౌలు ఒక కారణము ఎందుకో చెప్తున్నాడు ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయములన్నియు అనేకములైనను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు (2 కొరింథీ 12:12).యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతీ విశ్వాసి, సూచనలు, ఆశ్చర్యాలు, మరియు అధ్భుతక్రియలు, సూచనక్రియలు, ఆశ్చర్యాలు, మరియు అధ్భుతక్రియలు చేయుటకు క్రమపద్డతిలో సిద్డపరచబడి స్థోమత కలిగినవారుగా, అవి వుంటేనే అపోస్తలుడుగా గుర్తింపుపొందుటకు ఇవే లక్షాణాలు అని అనుటకు లేదు. అపోస్తలుల కార్యములు 2:22 యేసుక్రీస్తు ఆశ్చర్యాలు, అధ్భుతక్రియలు మరియు సూచనలు చేయుటకు నియమించబడ్డారు. అదేవిధంగా అపోస్తలులు వారు చేసిన అధ్భుతక్రియలను బట్టి వారు దేవునిచే పంపబడినా విచారణాదారులుగా గుర్తింపు పొందారు. అపోస్తలుల కార్యములు 14:3 పౌలు బర్నబాసు, అందించిన సువార్తను బట్టి వారు చేసిన అధ్భుతాలు కూడా సత్యమేనని ఋజువుపర్చబడ్డాయి.
కొరింథీ 12-14 అధ్యాలలో ప్రాధమికంగా ఆత్మీయవరాల విషయమై వివరిస్తుంది. ఈ పాఠ్యాభాగాలను చూచినట్లయితే సామాన్య క్రైస్తవులకు కూడ అధ్భుతవరాలు ఇవ్వబడినట్లు తెలుస్తుంది (12:8-10, 28-30). అయితే ఇవి ఎంత సామాన్యమైనవో అనేది మనకు వివరించబడలేదు. మనము ముందు నేర్చుకున్నరీతిగా అపోస్తలులు వారు చేసిన సూచకక్రియలు, ఆశ్చర్యములద్వారా గుర్తింపుపొందారని, అయితే సామాన్య క్రైస్తవులుకూడా అధ్భుతవరాలు అనుగ్రహించబడుట అనేది మినహాయింపు గాని నియమంకాదుని సూచిస్తుంది. అపోస్తలులు మరియు వారితోటి సహచరులు తప్ప నూతన నిబంధనలో ఎక్కడ కూడా ప్రత్యేకంగా వారు వ్యక్తిగతంగా ఆత్మచేత అధ్భుతవరాలను ప్రయోగిస్తున్నారని వివరించబడలేదు.
మరిముఖ్యంగా మనము గమనించాల్సింది ఆది సంఘానికి మనకిప్పుడునాట్లుగా పూర్తిస్థాయిలో బైబిలు గ్రంధం లేదు (2 తిమోతి 3: 16-17). అందునుబట్టి, ప్రవచించేవరం, ఙ్ఞానం, తెలివి మొదలగునవి చాల ఖచ్చితముగా ఆది క్రైస్తవులకు దేవుడు వారిని ఏమైతే చేయమన్నాడో వాటిని చేయుటకు గాను అవి ముఖ్య అవసరతలు. ప్రవచించే వరం విశ్వాసులను క్రొత్తసత్యాన్ని మరియు దేవుని ప్రత్యక్షతను తెలియపర్చటానికి సహాయపడింది. అయితే ఇప్పుడు దేవుని ప్రత్యక్షతను బైబిలు ద్వారా పూర్తిగ తెలియడమైంది. ప్రత్యక్షపరచే వరాలు ఇంకా ఎన్నటికీ అవసరతలేదు అంటే క్రొత్తనిబంధనలో నున్న రీతిగా అదే స్థాయిలో అవసరంలేదు.
దేవుడు అధ్భుతంగా ప్రజలను ఈ దినాలలో కూడా స్వస్థపరుస్తున్నాడు. దేవుడు ఇంకా మాట్లాడుతూనేవున్నాడు, అది బహిర్గంగా వినిపించబడే స్వరముతోనో, మనమనస్సులలోనో, భావనలలో మరియు చెరగనిముద్రలలోనో. దేవుడు ఇంకా గొప్ప అధ్భుతములు, సూచకక్రియలు మరియు ఆశ్చర్యాలు చేస్తూనే వున్నాడు. కొన్ని సార్లు ఈ అధ్భుతాలు క్రైస్తవులు ద్వారా చేయబడుతుంటాయి. ఏది ఏమైనా, ఇవి ఖచ్చితముగా అత్మచేత చేయబడే అధ్భుతవరాలు కాకపోవచ్చు. ఈ అధ్భుతవరాల ప్రాధమిక ఉద్దేశ్యం ఏంటంటే సువార్త సత్యమని ఋజువుపర్చడానికి, మరియు అపోస్తలులు దేవుని పరిచారకులని నిరూపించుటకు. అధ్భుతవరాలు నిలిచిపోయాయని బైబిలు కొట్టచ్చినట్లు చెప్పుటలేదుగాని అది ఖచ్చితముగా క్రొత్తనిభంధనలో రాసినట్లు ఆ స్థాయిలో అవి ఇంకా అనుకున్నరీతిలో ఎందుకు ఆ రీతిగా పనిచేయకపోవటానికి పునాది మాత్రమే వేస్తుంది.