దేవుని వాక్యం మీద విశ్వాసముతో విమానం కనుగొనడానికి ప్రయత్నించిన రైట్ బ్రదర్స్
విమానమును కనిపెట్టిన వ్యక్తులు, ఒర్విల్ రైట్ (Orville Wright - August 19, 1871 – January 30, 1948) మరియు విల్బర్ రైట్ (Wilbur Wright - April 16, 1867 – May 30, 1912). వీరిద్దరిని రైట్ బ్రదర్స్ అంటారు. వీరి తండ్రి పేరు మిల్టన్ రైట్ ( Milton Wright -- 1828–1917), ఈయన ఇండియానాలో బిషప్ గా పనిచేసేవారు.
ఒక రోజు మిల్టన్ రైట్ ప్రొఫెసర్ సాన్టినో (Santino) అనే వ్యక్తిని తమ చర్చికి రమ్మని పిలిచారు. అప్పుడు ప్రొఫెసర్ సాన్టినో ప్రపంచములో జరుగుతున్న మార్పుల గురించి, అద్బుతాల గురించి వివరిస్తూ, ఇక కొంత కాలానికి మనుషులు బహుశా గాలిలో ఎగిరిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడంతో రైట్ బ్రదర్స్ తండ్రి బిషప్ మిల్టన్ కోపగించుకొని సృష్టిలో దేవదూతలు, పక్షులు తప్ప మారేవి గాలిలో ఎగరనేరవని వాదించాడు. దీనితో ప్రొఫెసర్ సాన్టినోకి, బిషప్ మిల్టన్ రైట్ కు మధ్య స్వల్ప వివాదం జరిగినది, ఇది రైట్ బ్రదర్స్ గమనిస్తూ ఉన్నారు. రైట్ బ్రదర్స్ తండ్రి బిషప్ కావడంతో, వీరిద్దరూ బైబిలు వాక్యాలు చదవడంలో, వాక్య అన్వేషణలో శ్రద్ధ కలిగినవారు. ఒక రోజు అలా బైబిలు చదువుతుండగా
హోషేయ 11:11 వచనం వారిని ఆలోచింపజేసింది.
వారు వణకుచు పక్షులు ఎగురునట్లుగా
ఐగుప్తుదేశములోనుండి వత్తురు; గువ్వలు ఎగురునట్లుగా
అష్షూరుదేశములోనుండి ఎగిరి వత్తురు; నేను వారిని తమ నివాసములలో కాపురముంతును; ఇదే
యెహోవా వాక్కు. (
హోషేయా 11:11)
సుమారు
క్రీస్తు పూర్వం 755-710 మధ్య కాలములో
దేవుడు తన ధీర్ఘదర్శి
హోషేయ ద్వారా ప్రవచనరీతిగా పక్షులవలెను, గువ్వలవలెను మనుషులు ఎరిగి వస్తారని పలికించి వున్నాడు. బైబిలు నందు ప్రవచింపబడి ఉన్నదంటే అది నిశ్చయముగా జరిగి తీరుతుంది అని విశ్వసించిన రైట్ బ్రదర్స్, దేవుని వాక్యమును చేతబట్టుకొని ప్రయాసతో ప్రయత్నించారు.
పరిశుద్ధ గ్రంధంలోని మాటలు చదివి విశ్వాసంతో, కృషి చేత, దేవుని మహా కృపను బట్టి 1903 వ సంవత్సరం డిసెంబరు 17న విమానమును కనుగొని, గువ్వలు, పక్షులు ఎగురునట్లు ఎగిరి బైబిలు ప్రవచనం నెరవేర్చారు రైట్ బ్రదర్స్.
దేవునికే మహిమ కలుగునా గాక,
ఆమేన్.