క్షమించు తలంపులు


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

క్షమించు తలంపులు :

1 యోహాను 1:8 - "మనము పాపములేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు".

క్రీస్తు మన ప్రభువునూ, రక్షకుడని విశ్వాసముంచిన మాత్రాన మనమాయన దయను పొందుకోలేము గానీ మన పాపములను ఆయనయెదుట ఒప్పుకొని పశ్చాత్తాపపడితేనే మనకు మారుమనస్సు లభిస్తుంది.  పాపమును ఖచ్చితంగా ఒప్పుకోవాలి.  లేదంటే క్రీస్తును మన పాపవిమోచకునిగా మనము కనుగొనలేము.  మినహాయింపు యెదుట మన పాపములను అంగీకరించినప్పుడే మన పాపములు కడుగబడి ఆయన యొక్క దయను పొందగలము.  మన పాపవిమోచన కొఱకు ఆయన సిలువపై మరణమొంది ఎనలేని ప్రేమను దయను మనపై కురిపించాడు. అట్టి దేవుని వాగ్దానముపై ఆనుకొని అపవాదిని ఎదురించి ధైర్యముగా ముందుకు సాగిపోవడానికి నిశ్చయించుకొనుము.

ప్రార్థనా మనవి:

ప్రియమైన తండ్రి!! నీవు చేసిన వాగ్దానములను బట్టి నన్ను నిత్యం రక్షించుచున్నందుకు నీకు వందనములు.   నీ దయను కృపను జ్ఞాపకం చేసికొని ఎన్నడూ పాపము చేయకుండా ఉండుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.


Forgiving Thoughts: 

 I John 1:8 -  “If we say that we have no sin, we deceive ourselves, and the truth is not in us.” Not only is belief in Jesus Christ as our Lord and Saviour a prerequisite to receiving God’s forgiveness, but so is confession and repentance of sin. Acknowledgement of sin is necessary because if we do not believe we sin, then we will not recognize our need for a Savior to forgive us of our sin.  God’s promise is that when we confess, He forgives us and cleanses us of all sin and unrighteousness. Not most sin, but all sin. Not some unrighteousness, but all unrighteousness.  Past, present, and future sin has been forgiven and cleansed by our faithful and merciful Lord. Just as belief in Jesus Christ is necessary to receive forgiveness, belief that Jesus completed the work of forgiveness on the cross is also necessary in order to walk in victory. Satan would have us doubt God’s promises, but we must cling to God’s truth regardless of our feelings. What God has done cannot be undone. 

Talk to The King:   Father God, I thank You for Jesus’ completed work on the cross. I thank You that I am eternally secure in Your promises even when I doubt them.  Help me to remember Your merciful forgiveness of my sin when I am confronted with the sin of others. In Jesus’ name. Amen.