యోనా ఇది నీకు తగునా?


  • Author: Bro. Samuel Kamal Kumar
  • Category: Articles
  • Reference: Jesus Coming Soon Ministries

క్రీస్తునందు ప్రియమైన వారలారా! యేసుక్రీస్తునామములో మీకు శుభములు కలుగును గాక. జలప్రళయం, కేరళ రాష్ట్రాన్ని డీ కొట్టినప్పుడు ప్రజలు విలవిలలాడి కొట్టుకుపోతున్నారు. చెట్టుకు ఒకరు, గుట్టుకు ఒకరు, రోడ్డుకు ఒకరు ఇలా అక్కడక్కడ చెల్లా చెదురై పోయారు. ఇలాంటి ఘోరమైన విపత్తులో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతికితే చాలు దేవుడా అని, ఊరు వదిలి పరిగెత్తుతున్నారు.జలప్రళయం విలయతాండవముగా మారితే ఎవ్వరు తట్టుకోగలరు. ఇలాంటి జలప్రళయాలను తట్టుకున్న సంఘటనలలో జల ప్రళయాలకు భయపడని వ్యక్తులు ఇద్దరిని చూస్తాం. ఒకరు నోవాహు, మరొకరు యోనా.

అయితే నోవాహుతో యోనాను పోల్చలేం. ప్రజలన రక్షించడానికి నోవాహు ప్రయాసపడితే, జలప్రళయములో తన ప్రాణాన్ని తీసువేసుకోవడానికి యోనా ప్రయత్నించడం, అనాలోచితమైన చర్య. యోనా గ్రంథ 4 అధ్యాయాలే. ఈ 4వ అధ్యాయాల్లో కేవలం యోనాను గురించి వ్రాయబడ్డాయి. యోనా స్వతహాగా ప్రవక్త. ఈయన గెత్హేపేరు ఊరివాడైన అమిత్తే కుమారుడగు యోనా అని మనం చూడగలుగుతున్నాము.*యోనాకు దేవుడు అప్పగించిన బాధ్యతలు:*

దైవసేవకుడైన ప్రవక్త అయిన యోనాకు దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యత ఏమనగా నినీవే అనే ఊరికి వెళ్లి, వారి దోషము ఎక్కువాయెను, కనుక అక్కడికి వెళ్లి అచ్చట సువార్త ప్రకటించుమని తెలిపినప్పుడు, అచ్చట మార్పును తీసుకునివచ్చి, ప్రజలలో పశ్చాత్తాపము కలిగించే సందేశాన్ని వినిపించడానికి వెళ్ళమన్నప్పుడు యోనా గుడ్డిగా మొండిగా తిరస్కరించి ఆ ఊరికి వెళ్లలేదు.

*దేవుని మాట వినక తన మార్గములోనేవెళ్లిన యోనా:*

ఎంత దైవ సేవకుడైనా, కొన్నిసార్లు దేవుని మాటలు వినకుండా వెళ్లిపోయే ప్రమాదముంది. అలాంటి కోవకు చెందినవాడు యోనా. దేవుడు ఒక బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యతను విస్మరించి, నశించిపోతున్న ఆత్మలకు సువార్త అందించేది పోయి, తన ఆలోచన సరళిని మార్చుకుని వినయ విధేయతలు కోల్పోయి నాది నా ఇష్టారాజ్యం అన్నట్లుగా నేనెవరి మాటను వినను అనే మొండి వైఖరితో తన ఆఫీసుకు వెళ్లి, నేనిక సేవ చేయను అని, రాజీనామా పత్రాన్ని అక్కడ టేబులు మీద పెట్టి ఎవ్వరికి చెప్పకుండా, ఎవ్వరికి తెలియకుండానే నిరాటంకంగా నిరాటంకముగా వెళ్లిపోతున్నాడు. ఇంత దౌర్భాగ్యుడు.*దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్న యోనా:*

దేవుని సన్నిధిలోనే నేనుంటా, నేను గడుపుతానని దావీదు చెప్తుంటే, నేను ఉండను పోతానని వెర్రి ఆలోచనలతో సేవను విరమించుకుని తన స్వంత ఆలోచనతో ముందుకుసాగుతున్నాడు. అన్ని తెలిసిన దేవుని సేవకుడైన ప్రవక్త యోనా దేవుని సన్నిధి విడిచి వెళుతున్నాడు. తన నిర్ణయం సరైనదా? కాదే. ఇతను విలక్షణవాది.

ఎక్కడ కూడా ఏ సేవకుడు, నాకు దేవునిసేవ వద్దు అని చెప్పే వారిని ఎక్కడ చూడం. ఈయన మాత్రమే ఇలా ప్రత్యేకమైన విలక్షణములు కలిగినవాడు. దేవుని సన్నిధిలో ఉండుట ఆశీర్వాదమని లేఖనాలలోచూస్తే అలాంటిది నేనుండనని, భీష్మించుకుని కూర్చున్నట్లుగా చూస్తున్నాము. ఈలాంటి క్రైస్తవులు నేడు కూడా కన్పిస్తున్నారు.

పేరుకు క్రైస్తవులే, అయితే వారందరులోకములో గడిపి ఉద్యోగమంటూ, ఆదివారం వచ్చేపాటికి నిద్ర, విశ్రాంతి, టీ.వీ., సినిమాలు, షికార్లలో మునిగితేలుతున్నారు. ఈనాడు కుటుంబాలతో కలిసి మందిరాలకు రానివారెంతో మంది ఉన్నారు. బయట బయటనే తిరుగుతారు గాని లోపలికి ఏ మాత్రము రారు. లోపలికి వస్తేనే శరీరసంబంధమైన ఆత్మసంబంధమైన ఆశీర్వాదాలు పొందగలుగుతాం.

*యోనా ఆలోచనలు ఆయనకే సొంతం*

యోనా ఆలోచన ఒకటే. అదేమనగా నినీవే పట్టణస్తులు నశించిపోతే నాకేంటి? వారేమైన నా వారా? వారేవరో. అయినా నా రక్తసంబంధీకులు కాదు. నా వారు కారు.నా కులస్తులు కాదు. వారికెందుకు వాక్యము చెప్పాలి. నాకేమి లాభం అన్నట్లు యోనా ఆలోచన ప్రారంభమైనది. మరొక కోణములో తన దృష్టిలో నినీవే ప్రజలు కదలాడుతున్న చెట్లులాగా పరిగణించాడు తప్ప వారి రక్షణ కొరకు బాధ్యతలేనివాడిగా ప్రవర్తించాడు. వారి ఆత్మలకు యోనా బాధ్యుడనే విషయాన్ని మరిచిపోయాడు. ప్రతి సేవకుడు, ఆత్మల భారముతో సంఘములోపల, బయట ముందుకు వెళ్ళాలి. లేకపోతే రేపు తీర్పు దినాన దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు.*జలప్రళయములో ఇరుక్కున్న యోనా:*

యొప్పేకు వచ్చి, తర్షీషుకు పోవు ఓడ ఎక్కి ప్రయాణము మొదలుపెట్టగా దేవుని మాట వినని ఒకే ఒక వ్యక్తి యోనా కొరకు దేవుడు పెద్ద తుఫాను పంపించాడు.ఆ బీభత్సము అందరి కొరకు కాదు. ప్రత్యేకముగా యోనా కొరకు మాత్రమే రూపకల్పన చేయబడింది. అందుకే యెహోవా సముద్రం మీద గాలి పుట్టింపగా అని చూస్తున్నామ. కాబట్టి జలప్రళయాలు, ప్రకృతి బీభత్సాలు, తుపానులు, సునామీలు దేవుడు ఒక వ్యక్తి కొరకు లేకపోతే కొన్ని గుంపుల ప్రజల కొరకు లేకపోతే లోకం కొరకు కూడా పంపగలడు అనుటకు ఇదే నిదర్శనం.గాలి పుట్టించేది దేవుడే. వర్షం పడేటట్టు చేసేది దేవుడే. తుఫాను వచ్చేటట్లు చేసేది దేవుడే. ప్రకృతిని ఉసిగొల్పేది దేవుడే. దేవుడు ప్రకృతికి ఏమి చెప్పితే, అది విని దేవుని మాటకు లోబడుతుంది. కాని ఈ మానవుడు దేవుని మాటను వినటం లేదు. ఇంత ఘోరమైన విపత్తు రాగా యోనా ఓడ అమరమున నిద్రపోతున్నాడు. ఇలాంటి సమయాల్లో నిద్రపోకూడదు గాని, నిద్రపోతున్నాడు. ఎవ్వరైనా విపత్తు వస్తే ఏమి చేయాలి? మెలకువతో ఉండాలి. ప్రాణాలు అరచేతిల్లో పెట్టుకుని బయట పడ్డానికి ప్రయత్నం చేస్తారు. మనమైతే ఇలాంటి పరిణామాలు వస్తే సోమరితనముతో ఉండక, దేవునికి ప్రార్థించాలి. *ఏమి చేయాలో యోనాకు సూచించిన అన్యుడైన ఓడ నావికుడు:*

ఒక సేవకునికి అన్యుడు సలహాలు ఇవ్వటం ఎంత బాధకరం. ఒక శ్రమలో ఏమి చేయాలో తెలిసి కూడా బయట వ్యక్తులద్వారా అన్యుల ద్వారా సలహాలు పొందడం, బాధాకరమే. ఈ ఓడనాయకుడు లేచి నీ దేవునికి ప్రార్థించమని చెప్పడం ఒక రకముగా పరోక్షముగా సువార్త పరిచర్యనే. సువార్త పరిచర్య చేయవలసిన సేవకుడు ఆ పనిచేయలేకపోతే అన్యుడైన వానితో ఆ సువార్త పనిని చేయించడం, దేవుని కార్యమైయున్నది. ఈనాడు లోకం మనకు నీతులు చెప్పే స్థితికి రాకూడదు. అప్రమత్తత చాలా అవసరం. ప్రతి క్రైస్తవుడు ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యములో ముందున్నట్లు అయినచో నీకు మరొక లోకస్తుని సలహాలు అవసరం రాదు. మనకు సలహాలు ఇచ్చేది దేవుడే. ఈ గొప్పదేవుడు ఎప్పుడైనా ఎవరికైనా నీవు దేవుని బిడ్డవైనా, కాకపోయినా, ముఖ్యముగా శ్రమలలోవిపత్తులలో ఉండినప్పుడు ఆదుకుని కాపాడును.గాలి పుట్టించేది దేవుడే. వర్షం పడేటట్టు చేసేది దేవుడే. తుఫాను వచ్చేటట్లు చేసేది దేవుడే. ప్రకృతిని ఉసిగొల్పేది దేవుడే. దేవుడు ప్రకృతికి ఏమి చెప్పితే, అది విని దేవుని మాటకు లోబడుతుంది. కాని ఈ మానవుడు దేవుని మాటను వినటం లేదు. ఇంత ఘోరమైన విపత్తు రాగా యోనా ఓడ అమరమున నిద్రపోతున్నాడు. ఇలాంటి సమయాల్లో నిద్రపోకూడదు గాని, నిద్రపోతున్నాడు. ఎవ్వరైనా విపత్తు వస్తే ఏమి చేయాలి? మెలకువతో ఉండాలి. ప్రాణాలు అరచేతిల్లో పెట్టుకుని బయట పడ్డానికి ప్రయత్నం చేస్తారు. మనమైతే ఇలాంటి పరిణామాలు వస్తే సోమరితనముతో ఉండక, దేవునికి ప్రార్థించాలి. *ఏమి చేయాలో యోనాకు సూచించిన అన్యుడైన ఓడ నావికుడు:*

ఒక సేవకునికి అన్యుడు సలహాలు ఇవ్వటం ఎంత బాధకరం. ఒక శ్రమలో ఏమి చేయాలో తెలిసి కూడా బయట వ్యక్తులద్వారా అన్యుల ద్వారా సలహాలు పొందడం, బాధాకరమే. ఈ ఓడనాయకుడు లేచి నీ దేవునికి ప్రార్థించమని చెప్పడం ఒక రకముగా పరోక్షముగా సువార్త పరిచర్యనే. సువార్త పరిచర్య చేయవలసిన సేవకుడు ఆ పనిచేయలేకపోతే అన్యుడైన వానితో ఆ సువార్త పనిని చేయించడం, దేవుని కార్యమైయున్నది. ఈనాడు లోకం మనకు నీతులు చెప్పే స్థితికి రాకూడదు. అప్రమత్తత చాలా అవసరం. ప్రతి క్రైస్తవుడు ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యములో ముందున్నట్లు అయినచో నీకు మరొక లోకస్తుని సలహాలు అవసరం రాదు. మనకు సలహాలు ఇచ్చేది దేవుడే. ఈ గొప్పదేవుడు ఎప్పుడైనా ఎవరికైనా నీవు దేవుని బిడ్డవైనా, కాకపోయినా, ముఖ్యముగా శ్రమలలోవిపత్తులలో ఉండినప్పుడు ఆదుకుని కాపాడును.*దేవునికి ప్రార్థించమని కోరిన నావికుడు:*

ఓడలో ఉండేవారెవరు చావకూడదనే అభిలాష ఓడ నావికుడిలో ఉంది.అయితే నినీవె వారి పట్ల ఆ అభిలాష యోనాలో లేదు. అస్సలు ఓడలో ఉండే వారిపట్ల కూడా లేదు. అసలు తనకే బ్రతకాలన్న ఆశ లేదు. 1.ఓడలో ఉండేవారంతా బ్రతకాలి.2. ఓడలో ఉండేవారిపట్లదేవుడు కనికరము చూపాలి.

ఈ గొప్ప ఆలోచనతో ఓడ నావికుడు ఉన్నాడు. కనికరము చూపేవాడు దేవుడని ఓడ నాయకుడు తెలుసుకోవడం ఆశ్చర్యమే. ఆ విషయం యోనా గ్రహించలేదు. అందుకే రోమా 9:15 లో ఇలా వ్రాయబడివున్నది. *”పొందగోరువాని వలనైనను ప్రయాసపడు వానివలెనైనను కలుగదు గాని, కరుణించు దేవుని వలననే సమస్తమును జరుగును.”* కావున ఈ వాక్య ప్రకారము, దేవుడు కరుణచూపకపోతే మన శక్తి సామర్థ్యాలు మనలను రక్షించలేవు. కేవలందేవునిశక్తి నిన్ను కాపాడుతుంది. ఇతరులను కాపాడుతుంది. నీకెంత సామర్థ్యమున్న నీకెంత డబ్బున్నా, నిన్ను నీవు కాపాడుకోలేవు. ఇతరులను కాపాడలేవు. నిన్ను కాపాడువాడు ఆయనే. ఆయన కునుకడు నిద్రపోడు.*చావడానికి సిద్ధమైన యోనా:*

తుఫాను అనే కీడు ఎవ్వరిని బట్టి వచ్చిందని ఓడలోని వారు చిట్లు వేయగా, ఆ చేటి యోనా మీదికివచ్చెను. వారు విచారించగా నన్నెత్తి సముద్రములో పడవేయమని సమాధానమిచ్చాడు. ప్రార్థించేది పోయి, సమస్యలను ఎదురించేదిపోయి, మరణమే శరణ్యమంటున్నాడు. దేవుని పేరు చెప్పుకొని చావడానికి సిద్ధపడడం చాలా విచారించ దగ్గ విషయం. యోనాను సముద్రములో పడవేయగానే ఆ సముద్రము నిమ్మలించేను.

తుఫాను పొంగును ఆపడం వారి చేతకాలేదు. వారి ప్రయత్నాలన్ని బెడిసి కొట్టాయి. సమస్తం వ్యర్థమాయెను.*యెహోవా దేవున్ని వేడుకొనిన ఓడలోని ప్రయాణికులు:*

యెహోవా నీ చిత్త ప్రకారమే దేని చేసితివి. 2.ఈ మనుష్యుని బట్టి మమ్మును లయపరచవద్దు.3. నిర్దోషిని చంపితిమన్న నేరము మాపై మోపవద్దు
ఈ మూడు మనవులు దేవునికి చెప్పి, యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. అంతటితో ఆగక వీరు దేవుని ఎరుగక పోయినా, దేవున్ని ఆరాధించిరి. దేవునికి బలిఅర్పించిరి. దేవునికి మ్రొక్కుకొనిరి. ఎంత ఆశ్చర్యం.

 *దేవుని మాట వినకపోవుట చేత శిక్ష అనుభవించిన యోనా:*

దేవుడు ఒకమత్స్యమును ఆ సమయంలో సముద్రములో నియమించడము ఆశ్చర్యమే. ఎప్పుడైనా, ఎక్కడైనా ఏమైనా దేవుడు చేయగలడు అనుటకు ఇది నిదర్శనమై యున్నది. మాట వినడం మన కర్తవ్యం, లేకపోతే దేవుని శిక్షకు గురిఅవుతాం. ప్రియ పాఠకులారా, మొండి వైఖరిని ప్రదర్శించిన యోనా ఎవరికి మింగుడు పడని విధముగా ప్రవర్తించి, చేసిన తప్పుకు కాసుల చెల్లించి, గోతిలో పడినట్లుగా ఆ మత్స్యము అతనిని మ్రింగివేసెను.

ఆ సముద్రములో ఆ జలప్రళయములో ఆ మత్స్యము కడుపులోనుండి దేవునికి మొరపెట్టి పశ్చాత్తాపపడ్డాడు. ఆశ్చర్యమేమిటంటే, దేవుని సన్నిధి వదిలిపెట్టి వెల్లినా, సముద్రములో తన పాపాలు ఒప్పుకోవడం ,ఆశ్చర్యమే.

 *సముద్రములో పాపాలు ఒప్పుకున్న ఒకే ఒక వ్యక్తి యోనా భక్తుడు మాత్రమే.* నీవెప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలలోనో, జలప్రళయములోనో, శిథిలాలకిందనో బావిలోనో, ఎక్కడైనా నీవిరుక్కుంటే అక్కడ కూడా నీ పాపాలను గురించి పశ్చాత్తాపపడే అవకాశాన్ని దేవుడు నీకిస్తాడు. అక్కడ దైవసేవకుడు లేకపోయినా, పై నుండి దేవుడు చూస్తుంటాడు కాబట్టి అక్కడ మీ పాపాలు ఒప్పుకొని దేవుని ద్వారా పాపక్షమాపణ పొంది మార్పుచెంది, బాప్తిస్మ అనుభవములోనికి నడవాలి. దేవుడు నీ పాపమును క్షమించు గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమెన్.