మేము నిరీక్షించియుంటిమి (లూకా 24:21).
ఒక విషయం నేనెప్పుడూ బాధపడుతుంటాను. ఎమ్మాయికి వెళ్ళే దారిలో ఆ ఇద్దరు శిష్యులు యేసుతో “మాకింకా నిరీక్షణ ఉంది” అనలేదు. “మేము నిరీక్షించాము” అన్నారు."ఇది జరిగిపోయింది. కథ అంతమై పోయింది"
వాళ్ళు ఇలా అనాల్సింది. "పరిస్థితులన్నీ మా నిరీక్షణకి వ్యతిరేకంగా ఉన్నాయి. మా నమ్మకం వ్యర్థమైపోయిందేమో అన్నట్టుగా ఉంది. కాని మేము మాత్రం ఆయన్ని మళ్ళీ చూస్తామన్న నిరీక్షణను పోగొట్టుకోలేదు" తాము కోల్పోయిన విశ్వాసాన్ని ఆయనకి వెల్లడిస్తూ ఆయనతో నడిచారు. చివరికి ఆయన "అవివేకులారా, విశ్వాస రహితులారా! అంటూ వాళ్ళని గద్దించవలసి వచ్చింది.
ఈ మాటలు మన గురించి కూడా అనే ప్రమాదం ఉంది. సత్యానికి, ప్రేమకి ఆధారభూతుడైన దేవునిలో విశ్వాసాన్ని పోగొట్టుకోనంత కాలము మనం దేన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు.
ఈ శిష్యుల్లాగా మన విశ్వాసాన్ని భూత కాలంలో అంటే జరిగిపోయిన కాలంలో చెప్పవద్దు. ఎప్పుడూ "మేము నిరీక్షించి యుంటిమి" అనడానికి బదులు "మేము నిరీక్షించుచున్నాము" అనండి
వసంతం వయ్యారాలొలకబోస్తూ వచ్చింది
అన్ని కొమ్మలూ పూలతో బరువుగా ఊగుతున్నాయి
గులాబీలు పూసినప్పుడు నమ్మకముంచాను దేవునిపై
ఇప్పుడూ నమ్మకముంచుతున్నాను
గులాబీలు వాడినప్పుడు నా విశ్వాసం వాడితే
బలహీనమైనదనే నా నమ్మకం
తుపాను మేఘాలు కమ్మిన వేళ నిరీక్షణ మారితే
ఆయన ప్రేమని శంకిస్తే అతి నీరసమే నా నిరీక్షణ