వరమంటి తలంపులు - Gifted Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

వరమంటి తలంపులు:
రోమా 12:6‭ - "మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వేర్వేరు కృపావరములు కలిగినవారమైయున్నాము".

నీ దేవుడైన యెహోవా నీకు ప్రత్యేకమైన మరియు అద్భుతమైన తలాంతులను, సామర్థ్యాన్ని ఇచ్చాడు. నీవు వాటిని వృద్ధి చేసుకొని నీ తోటివారి కోసం ఉపయోగించినప్పుడు అనేక గొప్ప అద్భుతాలు జరుగుతాయి. కానీ అట్లు కాకుండా దేవుని ఉద్దేశము ప్రకారం కాక వేరే విషయముల కొఱకు ఉపయోగిస్తే నీ జీవితం అంతా గందరగోళంతో నిండి నశించిపోతావు. గనుక నీ శక్తిసామర్థ్యాలు దేవుడిచ్చిన బహుమానాలని జ్ఞాపకముంచుకో. వాటిని సద్వినియోగం చేసుకుని దేవుని మహిమపరచుము.

ప్రార్థనా మనవి:
ప్రభువా!! నీ నుండి పరిశుద్ధాత్మ ద్వారా నేను పొందిన కృపావరమును బట్టి నీకు వందనములు. ప్రతీ వరమును నిన్ను మహిమపరిచే విధంగా నన్ను నడిపించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.

Gifted Thoughts:
ROMANS 12:6 - We have gifts that differ according to the grace given to us.” Your Creator has gifted you in unique and wonderful ways. He’s crafted you with particular abilities and talents. When you develop your God-given attributes and use them to serve other people in love, great things can be accomplished. But if you try to function apart from your talents, or if you attempt to use your abilities in ways God didn’t intend, you’re headed for a life filled with anxiety, frustration, and failure. Never forget your potential lies in the arena of your God-given giftedness. The very building blocks of your potential will always be the gifts He’s given you.

Talk to The King: Lord, I thank You for the gifts I have received from You and the gifts I gained through Your Holy Spirit. Guide me to use every gift for Your glory alone. In Jesus name, I pray, Amen.