ఏకమైయున్న తలంపులు - United Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

ఏకమైయున్న తలంపులు:
1 కొరింథీయులకు 12:24 - "అయితే శరీరములో వివాదములేక యుండుడి".

ఇక్కడ పౌలు మనము పాలిభాగస్థులుగా ఉన్న సంఘమును శరీరముతో పోల్చుచున్నాడు. క్రీస్తునందు సహోదరులమైన మనము వేరువేరుగా ఉండుట కన్నా ఐక్యముగా ఉండుట ఎంతో మంచిది. కానీ ఈనాడు క్రైస్తవులను మనం గమనిస్తే వారు ఆరాధించే విధమును బట్టి, ఆచారములను బట్టి భేదములు కలిగి విడిపోయి పరలోకమందున్న తండ్రిని సిగ్గుపరచి ఆయన యొక్క మనసును ఆయాసబెట్టుచున్నారు. గనుక నేడే సంఘమంతయూ ఏకశరీరముగా ఉండి ఏకమనస్సును కలిగి వరునిగా వచ్చుచున్న క్రీస్తు కొఱకు వధువువలె సిద్ధపడుటకు ప్రార్థించెదము.

ప్రార్థనా మనవి:
ప్రియమైన తండ్రి! ఈ సమయములో సంఘమంతయూ భేదములు విడిచి ఏకశరీరముగా ఏకరీతిగా నడుచుకోవాలని ప్రార్థించుచున్నాను. నీ రెండవరాకడలో వరునిగా వచ్చుచున్న నీ కొఱకు సిద్ధపడుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.

United Thoughts:
1 Corinthians 12:25- And so there is no division in the body.” The body here Paul refers is the church of we are all part of. We as children and brothers and sisters in Christ should not have division among us but should stay united. Sadly today Christians are the vastly divided groups with differences in way or worship or thinking thereby failing bitterly in our unity and shaming our heavenly Father. Today take a decision to pray for unity in your church, churches in your city and the church of the world so that we all may be united as a single bride waiting for our bridegroom , our Lord Jesus Christ. How blessed it is to be in one mind.

Talk to The King:
Father God, I pray today for the unity of my church and all churches of the world so that we may be one looking only onto You and laying aside our differences. Help us, Master to wait for Your second coming as a united bride. In Jesus name, I pray, Amen.