ఆంతర్యంలోని తలంపులు:
2 కొరింథీయులకు 4:16 - "మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు".
మానవులుగా మనం మనలను బాధలకు గురవుతారు అలాగే తోటివారిని బాధపెడతాము. ఎదుటివారు తమను గుర్తించుట లేదని కలతపడుచూ ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం మనలను బాధపెట్టినవారిని సైతం ప్రేమించమని చెప్పుచున్నాడు. గనుక నీకు బాధను కలిగించిన వారిని క్షమించి ప్రేమించుము. నీలోని ఆంతర్యపురుషుని వికసించునిమ్ము. నిన్ను బాధపెట్టినవారు నీ భార్య/భర్త, తోబుట్టువులు, కుటుంబసభ్యులు మరియు స్నేహితులు ఎవరైనా కావచ్చు. చిన్న చిరునవ్వుతో వారిని క్షమించి ప్రేమతో దగ్గర చేసుకోండి. ప్రభువువలె మాదిరికరముగా
ఉండుడి.
ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!!!! నన్ను ఎప్పుడూ బాధపెట్టువారిని క్షమియించి ప్రేమించే మనసుని నాకు దయచేయుము. నిన్ను పోలి నడుచుకొనుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.
Inward Thoughts:
II Corinthians 4:16- Even though our physical being is gradually decaying, yet our spiritual being is renewed day after day.” We as human beings tend to get hurt and hurt others too in our daily lives. We often hate people because they do not acknowledge us. But Jesus very clearly says, to love those who hurt you. Today no matter how hurt you are on the outside, spread only love and let your inward Soul blossom. Hold no grudges but instead love everyone. Some people are hurt on daily basis by their husbands or other family members, friends or acquaintances. My Sister/brother, I know it"s tough but love them back and show that their hurting does not affect you. Smile and spread love.
Talk to The King:
Father God, help me to show love to those who constantly hurt me. Let my inner soul blossom instead of deteriorating by these hurtful words. In Jesus name, I Pray, Amen.