విశ్వాసముతో కూడిన తలంపులు:
మత్తయి 14:31 - "అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివి?"
ప్రతీ విషయములో అనగా ప్రతీ అనుబంధములో,
ప్రతీ నిర్ణయములో, ప్రతీ పనిలో దేవునియందు విశ్వాసముంచడమంటే సాహసమనే చెప్పాలి. కానీ ఆ సాహసం విశ్వాసంలో భాగమే. మనము విశ్వాసముంచు దేవుని మనం చూడలేకపోవచ్చు కానీ ఫలితమును చూడగలము. మనకు మున్ముందు ఏం సంభవించబోతుందో మన జీవితం ఎటునుంచి ఎటు పోతుందో అర్థం కానప్పుడు ఆయన యొక్క వాగ్దానములపై పూర్తి విశ్వాసమునుంచడం వలన మనకు ఉపశమనం కలుగుతుంది. ఆయన యొక్క సాటిలేని ప్రేమయందు నమ్మకముంచుట చేత మనము ఊహించని రీతిలో మనలను మారుస్తాడు. గనుక దేవునియందు విశ్వాసముంచుటలో సాహసాన్ని కలిగియుందాము.
ప్రార్థనా మనవి:
ప్రియమైన తండ్రి!!! నన్ను అద్భుతమైన రీతిలో మలిచి బలపరిచినందుకు నీకు వందనములు. నీయందు విశ్వాసముంచుటలో ధైర్యముగా ఉండుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.
Faithful Thoughts:
Matthew 14:31- How little faith you have! Why did you doubt?” A significant amount of risk is involved in trusting God in all things, relationships, choices, and decisions. Risk, after all, is part of the very nature of faith. Putting our belief in God whom we can’t see but still experience. Putting our faith in His promise to work all things to our benefit, even if we can’t understand what must occur to get us from where we are to where we hope to be. Putting our faith in the love of God to transform us in ways we can’t even begin to imagine or expect. What we see as a risk from our perspective could be the very situation God uses to strengthen our faith. So take risk in trusting the Lord.
Talk to The King:
Father God, I thank You for the wonderful way You mould me to strengthen me in Your faith. Give me the courage to take risk in trusting You at all times. In Jesus name, I pray, Amen.