ఆనందకరమైన తలంపులు:
కీర్తనలు 37:4 - "యెహోవాను బట్టి సంతోషించుము".
మనలో కొందరికి వేకువనే లేచి దేవుని ప్రార్థించడంలో ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఆయనతో తమ శ్రేష్ఠమైన సమయాన్ని గడపడంలోనే నిజమైన ఆనందాన్ని అనుభవిస్తారు. వారికి అది ఉన్న ప్రత్యేక గుణము కాదు... రాత్రివేళ మేల్కొని ఉన్నవారికది శాపమూ కాదు. ఏ సమయమందైనా ప్రభువుతో గడిపితే ఆనందము కలుగుతుంది. దేవుడు మనలను బలవంతపెట్టువాడు కాడు. కానీ మనం ఆయనతొ సమయాన్ని గడపాలని కోరుకుంటున్నాడు. దానికి వేకువ సమయమే శ్రేష్ఠమైనది. గనుక దేవునితో నీవు గడుపదలచిన సమయాన్ని జాగ్రత్తగా పాటించుము. మనఃపూర్వకముగా ప్రార్థించుము.
ప్రార్థనా మనవి:
పరలోకమందున్న దేవా!!! నీ సన్నిధిలోనికి నన్ను
నడిపించుచున్నందుకు నీకు వందనములు. నీతో గడుపు సమయమునందు సదా ఆనందించు భాగ్యాన్ని కలిగించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.
Delightful Thoughts: Psalms 37:4- “Delight yourself also in the Lord.” For some of us, waking up and delighting in the Lord comes more easily and naturally than for others. Some of us wake up early in the morning to spend time with God and some of us prefer to spend time at night. It is not that morning people have been given a supernatural ability that the rest of us lack. Others haven"t been punished with night-time creativity. Instead no matter what the time is, delight in the Lord in His presence and hear Him. God does not pressurise you on timings but He wants to spend time with you. It"s said that morning time is best because it prepares us for the day. Plan your day so that you don"t force yourself to come into God"s presence. Instead come into His presence willingly and with joy.
Talk to The King: Father God, thank you for the way you guide me into Your presence. Let me always delight in You at all times. In Jesus name, I pray, Amen.