నిర్మించు తలంపులు


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

నిర్మించు తలంపులు:
యిర్మీయా 29:11 - "నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును".

మన తండ్రియైన దేవుడు మనమెప్పుడూ క్రొత్త విషయములను నేర్చుకొని నవీనముగా ఉండాలని ఆశపడుచున్నాడు. జీవితంలో ముందుకు సాగిపోయే కొలది ఎన్నో అవకాశాలు, ఆటంకాలు, మలుపులు, సహవాసములు, బంధాలను మనం ఎదుర్కొంటాము, అనుభవిస్తాము. ప్రతీ అవకాశము మంచిది కాదు. నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నియూ దేవుని ఏర్పాటులో ఉన్నవి కావు. కానీ నీవు దేవుని ప్రతీసారీ ప్రార్థనలో అడిగితే నూతన అవకాశాలను పొందగలవు. ఆయన తన మార్గమును మనకు తెలియజేసినందుకు తన చిత్తము నెరవేర్చులాగున మనలను నడిపిస్తాడు. ఎందుకంటే ఈ ఆయన మనయెడల ఒక ప్రణాళికను కలిగియున్నాడు. గనుక నిశ్చింతగా ఆయనయందు విశ్వాసముంచుము.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!!!నీవు నా యెడల కలిగియున్న ప్రణాళికను బట్టి నీకు వందనములు. నీయందు విశ్వాసముంచి నూతన అవకాశాలను పొందుటకు సహాయము చేయుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.