ఘనమైన తలంపులు - Best Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

ఘనమైన తలంపులు:
ఎఫెసీయులకు 2:10 - "దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై.... ఆయన చేసిన పనియైయున్నాము".

నీవెవరివైనా, నీవెంత సాధించినా, ఎంత సంపాదించినా, ఎంతటి విజయాన్ని సాధించినా దేవుడు నీ విషయంలో ఇంకా ఏదో ఆలోచన కలిగియున్నాడు. ఇంకా జరుగవలసిందేదో ఉంది. ఇంకా ఘనమైనదేదో ఉంది. నీవు ఒకవేళ దేవునితో సహవాసమును
కలిగియుంటే గనుక పరలోకరాజ్యములో నిత్యజీవమును పొందుటయే నీ ముందున్న విషయం. ఇప్పుడు పరలోకమును చేరే మధ్య నీ జీవితంలో దేవుడు నీకు అధికమైన శక్తిని దయచేసి ఉన్నత శిఖరాలకు చేర్చి ఒక గొప్ప సాక్ష్యముగా నడిపించాలని కోరుచున్నాడు. ప్రతీ ఒక విశ్వాసి విషయంలో ఆయన ఈ విధమైన ప్రణాళికను కలిగియున్నాడు. నీవు గతంలో సాధించినదేదైనా సరే అది నీవు సాధించాల్సిన దానికి ఆరంభం మాత్రమే.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!!! నీవు నా కొఱకు సిద్ధం చేసిన గొప్ప విషయములను బట్టి నీకు వందనములు. సదా ఘనమైనవాటినే నిన్ను అడుగుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్.

Best Thoughts:
Ephesians 2:10- “ God planned in advance for us to live our lives doing.” No matter who you are …No matter the accomplishments, achievements, or degree of success you’ve already experienced in life …God still has more for you. There’s still something to be and do. His very best lies ahead of you. Because if you’re in right relationship with God, what eventually lies ahead for you is eternal life in heaven. Between now and when you go to heaven, God desires to build upon what is and take you from height to greater height, strength to greater strength, and glory to greater glory. That’s His plan for every believer. Therefore, no matter what you’ve known as the best of life in the past is only a prelude to the next greater thing God has for you.

Talk to The King:
Father God, thank You for the best things You have prepared for me. Help me to always look onto You for the best things. In Jesus name, I pray, Amen.