ఆత్మస్వీకరణా తలంపులు:
గలతీయులకు 1:10 - "నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును".
నీవు ఎప్పుడైనా నీ చుట్టూ ఉన్నవారితో పోల్చుకొని నేనలా లేనని అనుకున్నావా? నీకన్నా గొప్పవారిని చూచి అసంతృప్తి చెందావా? ఒకవేళ మనం అలా అసంతృప్తి చెందినా దానిని లోలోపలే దాచుకుని బాధపడుతూ ఉంటాము. మనము గొప్పవారిలా ఉండాలని వారు మనతో స్నేహించడం కోసం వారిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాము. అది సహజం! కానీ మనం ప్రతీ ఒక్కరికీ నచ్చాల్సిన అవసరం లేదు. కానీ మనం క్రీస్తునకు నచ్చే విధంగా ఉండాలి. అదే మన గమ్యం.
ప్రార్థనా మనవి:
ప్రియమైన తండ్రి!!! నన్ను నన్నుగా చేసినందుకు నీకు వందనములు. తక్కువ చేసుకోకుండా ప్రతీ ఒక్కరూ నన్ను స్వీకరించాలని కోరుకొనకుండా నిన్ను స్తుతించుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.
Self Accepting Thoughts: Galatians 1:10- “For if I still pleased men, I would not be a bondservant of Christ.” Have you ever felt like you were not good enough or that you didn’t measure up to the people around you? Perhaps you felt inadequate by someone you perceive to be more popular or from people with higher status. Unfortunately, when we feel different from others, we often try to hide our inadequacies and our shame of being different. It’s only natural to want to be accepted by those we consider popular or cool, but we cannot pretend to be someone we are not just to gain acceptance. The good news is that we do not have to be like everyone else. We must be willing to take the first step by learning to embrace ourself and appreciate who we are in Christ.
Talk to The King:
Father God, thank You for making me as myself. Help me love myself and accept who I am in You. Let me never degrade myself or look for acceptance from men. In Jesus name, I pray, Amen.