సాధ్యమైన తలంపులు:
మత్తయి 19:26 - "దేవునికి సమస్తమును సాధ్యము".
దేవుడు నిన్ను ఒక కార్యము కొఱకు ఏర్పరచుకున్నాడని అది నీ జీవితంలో గొప్ప సాక్ష్యముగా మారబోతోందని నీకు అనిపించిందా? మనం ఊహించినట్లుగా కాకుండా కొత్తగా ఎదురయ్యే పరిస్థితులను చూస్తే కొంత ఇబ్బందికరముగా ఉంటుంది. మనము సౌకర్యాలకు అలవాటు పడిపోతే ఆత్మసంతృప్తి కలిగి ఎప్పటికీ సాహసానికి ముందడుగు వేయలేము. నీవు ఎంత గందరగోళంలో ఉన్నా దేవుడు నీ యెడల ఒక ఉద్దేశ్యమును కలిగియున్నాడని నీవు తెలుసుకొనినప్పుడు నీవు చాలా ధైర్యంగా నమ్మకంగా ఉంటావు. దేవుడు మనయెడల కలిగియున్న ఉద్దేశాలు ఎంత ఘనమైనవో మనము గ్రహించలేము. గనుక ఆయన యొక్క చిత్తముపై విశ్వాసముంచుము.
ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!!! నాకు తోడైయుండి నడిపించుచున్నందుకు నీకు వందనములు. అవును దేవా!! నీయందు సమస్తమూ సాధ్యమే. నీ వాగ్దానములపై ఆధారపడి జీవించుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.
Possible Thoughts:
Matthew 19:26 - “for God all things are possible.” Have you ever felt that God was calling you to do something but knew it would bring about a big change in your life? New assignments from God can make us uncomfortable because we like the familiar things in life. Unfortunately, when we become too comfortable, we tend to grow complacent, and complacency can limit new vision for your life and ministry. Regardless of how apprehensive you may feel, when God wants you to accept a call to do something different, you can be certain that He will work it all out for you.We must realize that God knows the plans He has for us, but we often do not know just how big those plans are. Don’t be afraid to believe that God made you for more and that He is preparing you for more than you could ever expect.
Talk to The King:
Lord God, I thank You for the way you guide me in not believing myself but depending on You. Yes Lord, I believe that through You everything is possible. Help me always lean on Your promises. In Jesus name, Amen.