విశ్వాసముంచు తలంపులు:
కీర్తనలు 9:10 - "యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచి పెట్టువాడవు కావు".
ఎవరూ నిన్ను అర్థం చేసుకోనప్పుడు, నీ వ్యథను ఎవరూ అర్థం చేసుకోనప్పుడు, నీ చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కానప్పుడు రోజులు చాలా భారంగా, నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. నీ హృదయం చుట్టూ బాధలను తట్టుకోవడానికి మన ఆంతరంగిక శక్తి అనే ఒక కంచె ఉన్నది కానీ కఠిన శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోవడం దాని వలన కాదు. తట్టుకొనే శక్తి కేవలం ఒక్క దేవునియందే మనకు దొరుకుతుంది. ఆయన మన హృదయానికి కవచం. నీకు రక్షణగా ఆయనను నీవు కలిగి ఉన్నంతవరకూ నీకు ఏ విధమైన వేదన కలిగినా ఆయనే అన్నియూ సరిచేస్తాడు.
ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!!! నీవు నన్ను కాయుచున్న విధమును బట్టి నీకు వందనములు. నా హృదయమును కలవరపాటు నుండి రక్షించుచున్నందుకు నీకు స్తోత్రములు. నన్ను లేవనెత్తి బలపరచుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.
Trusting Thoughts: Psalms 9:10- “ For You, Lord , have not forsaken those who seek You.” The days can be long when you feel that no one understands you—no one knows your story, what you have gone through. It is a long day, so hard on your heart, when you feel that no one cares. There is a shield building around your heart now—it has been for some time. A wall of protection. You think you protect yourself from being hurt by letting the wall go up. But this wall cannot stay up if you want more in this life than resentment and fear and pain. Let God be the protector of your heart. Let Him be your shield. Let Him help you in situations where you are trusting another person again and you can’t control how they are going to treat you. Let Him guide you so you know where to turn—whether to keep pursuing this relationship or whether to walk away. God cares, most of all, how they affect your heart.
Talk to The King:
Father God, I thank You for the way You care for me. Thank You for protecting my heart from being hurt. Help me Lord to pick myself up and strengthen me for its You I rely. In Jesus name, I pray, Amen.