సందేహంలేని తలంపులు:
ఎఫెసీయులకు 6:10 - "ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి".
అనుమానం సత్యాన్ని మరుగుపరుస్తుంది. మన నుండి దూరం చేస్తుంది. దేవుడు ప్రతీసారీ మన పాపములను కడిగి వేసి మనకు ఒక కొత్త
ఆరంభాన్ని ఇవ్వాలని అనుకుంటాడు. అలాగే మనలను సత్యం నుండి దారి మళ్ళించే వాటినుంచి మనలను సత్యంలోకి నడిపించడానికి ఆయన నిత్యం శ్రమిస్తూ ఉంటాడు. కానీ ఎటువైపు ఉండాలి అనేది నీ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. ఆశ కలిగి నీ పరిస్థితులనన్నింటినీ ఆయన చేతులకు అప్పగించినప్పుడు మనకు సమాధానము దొరుకుతుంది మరియు శ్రమలను ఎదుర్కొనే శక్తి దొరుకుతుంది. అప్పుడు దేవుని సన్నిధిని కలిగియుండడానికి లేకపోవడానికి మధ్య తేడా తెలుస్తుంది. గనుక నీకున్న ప్రతీ సందేహాన్ని ఆయనకు అప్పగించుము.
ప్రార్థనా మనవి:
పరలోకమందున్న తండ్రి!!! నాలోనున్న సందేహాలను నివృత్తి చేసి నన్ను సత్యం వైపు నడిపించుచున్నందుకు నీకు వందనములు. నేను కలిగియున్న ప్రతీ శ్రమనుండి నాకు విజయమును అనుగ్రహించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.
Doubtless Thoughts:
Ephesians 6:10- “Be strong in the Lord and in the power of His might.” Doubt is what steals away truth. It makes it distant from you. God is all about new beginnings. God is the one who washes away sin. And He is in the business of continuing to wash you clean of the things that make you doubt, make you distracted from truth, and pull you away from Him. But this is your choice now: lean into hope, surrender all circumstances, pursue loving people the way God had made you to do it. And then you are restored again. The circumstances are only restored when God is present. And then how you act and let God play a part is what makes a difference. Leave aside your doubts and let God act.
Talk to The King:
Father God, I thank You for the way you remove my doubts and help me rely on You. Help me win over every doubt and grow in You. In Jesus name, I pray, Amen.