స్వస్థపరచు తలంపులు:
రోమా 8:37 - అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.
మనము ఒత్తిడిలో ఉన్నప్పుడు గతంలో జరిగిన విధంగా మనము శోధనలో పడిపోతాము. దేవుని ఉద్దేశ్యాలను ప్రశ్నించే విధంగా సాతాను మనలను శోధిస్తాడు. ఒక్కసారి అపవాదికి మన హృదయంలోనికి తావిస్తే మనలను మనకే విరోధముగా మార్చివేస్తాడు. కానీ అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలని నిశ్చయించుకుందాం. శ్రమలు మనలను దేవునికి మరింత దగ్గర చేస్తాయి గనుక శోధనలు ఎదురైనప్పుడు కలవరపడక
ఆయనయందు స్థిరమైన విశ్వాసమును కలిగి ప్రార్థించాలి. పరలోక సంబంధమైన జ్ఞానం ఘనమైనది. అది మనలకు అత్యధిక విజయాన్ని అందిస్తుంది. గనుక ఈరోజున ఏవైతే శోధనలను కలిగియున్నావో వాటిని ఎదురించు శక్తి కొఱకు ప్రార్థించుము.
ప్రార్థనా మనవి:
పరలోకమందున్న తండ్రి!!! నీ నన్ను విజయుడిగా చేసిన విధమును బట్టి నీకు వందనములు. నిరాశ నిస్పృహలు నన్ను కృంగదీసేటప్పుడు నేను దారి తప్పిపోకుండా స్థిరవిశ్వాసంతో నడుచుకొనుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.
Healing Thoughts:
Romans 8:37 “ Yet in all these things we are more than conquerors through Him who loved us.” When we get stressed, we tend to jump back to those same memories in our past. The devil lures us to question God""s intentions. Once he gets us to doubt God and to doubt ourselves, he capitalizes on that deception to turn us against each other. But today let not the devil influence you. Instead use these moments to get closer to God. These are the moments when we are desperate, and we seek God with a different kind of intensity and consistency. The wisdom from heaven is pure. It leads to the unadulterated, unashamed cry of our hearts to Jesus, asking Him to heal us and conquer all the stressful thoughts and lead us into His ultimate peace.
Talk to The King:
Thank You Lord for I am a conqueror in You. Help me never be misguided in times of desperate situations. Instead help me find You. In Jesus name, Amen.