నేర్చుకొనే తలంపులు - Learning Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

నేర్చుకొనే తలంపులు:
మత్తయి 11:29 - "మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి".
దేవుడు మనకొఱకు ఒక రక్షకుని ఈ లోకమునకు పంపించెను. మనకు అన్నీ తానైయుండి మనమేదడిగినా మనకెన్నడూ లేదని చెప్పేవాడు కాడు కదా. కానీ ఆయన మనుష్యులను వారి ఇష్టము చొప్పున జరిగించువాడు కాడు గానీ ఆయన వద్దు అన్న సందర్భాలు ఉన్నాయి. యేసు మనం తప్పిపోకుండా మనకు హద్దులను ఏర్పరిచి మనపై మునుపెన్నడూ ఎవ్వరూ చూపించని ప్రేమను కురిపించెను. ఆయన తన పని నిమిత్తం తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఎంతో శ్రమించుచూ తనను ఆటంకపరచు ప్రతీ సమయంలో ఆయన తన కాడిని దించివేయలేదు. ఇదే ఆయన మన విషయంలో కోరుకొనేది. గనుక దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్పప్రకారం నడుచుచూ ఆయనను సంతోషపెట్టెదము.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!!! తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చు విషయంలో నిన్ను నువ్వే మాదిరిగా కనుపరచినందుకు అనేక వందనములు. మేము కలిగియున్న అన్నింటిలోనూ మొదటి ప్రాధాన్యత నీకే ఇవ్వడానికి మాకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.

Learning Thoughts:
Matthew 11:29-“Take My yoke upon you and learn from Me.” God sent us The Saviour of the world. Surely He was all things to all people and never said NO, right? Wrong. Jesus Wasn""t a People-Pleaser. There were instances in the Bible wherein Jesus said ""NO"" to people. Jesus practiced boundaries with love and strength like no one has before or since. He regularly said "NO" to preaching, teaching, and healing anxious crowds so He could walk dusty paths up desert mountains to be alone with His Father in prayer.  Jesus said NO to thousands of people and requests and needs because He was clear on His mission. He knows who He is—God’s beloved Son. He knows why He came—to bring God’s kingdom. He kept His mission ever before Him. This same Jesus invites us to understand who we are, Whose we are, and what our mission is. Channel out the important things God has prepared you for and concentrate on them rather than looking for self pleasing or people pleasing.

Talk to The King:
Father ,thank You for the example You have shown me in Jesus that it is important to say "NO" at times. Help me Lord to prioritize things and keep You first. In Jesus name, Amen.