ప్రథమమైన తలంపులు:
మత్తయి 6:33 - కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.
దేవుని కన్నా మనం అధిక ప్రాముఖ్యత యిచ్చే దేని వలనైనా, ఆయనతో సమానంగా మనం స్థానమిచ్చే ఏదైనా మనలను ఆత్మీయంగా బలహీనపరచి దేవుని యెడల మనం కలిగియున్న ప్రేమను, విశ్వాసమును పడగొట్టేలా చేస్తాయి. మన ఆత్మను దేవుని రక్షణ నుంచి దూరపరచుతాయి. నిన్ను సృష్టించి నిత్యం కాపాడుచూ అన్నియూ సమకూర్చుచున్న దేవుని ఆహ్వానిస్తే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అన్నింటినీ పక్కన పెట్టి ఆయనకే మొదటి ప్రాధాన్యతనిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అది జీవితాన్ని సవాలు చేసే నిర్ణయం. దేవునిని ముందుపెట్టి మన జీవితాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయనకు మనము ఇంక వేరేగా ఇచ్చేది ఏం లేదు. కానీ దేవుని కొఱకు మనం అన్నీ వదులుకున్నప్పుడు మనం నూతన రూపాన్ని సంతరించుకొని ఆయన రాజ్యానికి సిద్ధపడినట్లే.
ప్రార్థనా మనవి:
పరలోకమందున్న ఓ మా ప్రియ తండ్రి!!! మా జీవితంలో మొదటి నీకే ప్రాధాన్యత యిచ్చుటలో సహాయము చేయుము. మా జీవితాలను నీకు అప్పగించుటకు సహాయం చేయుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్.
First Thoughts:
Matthew 6: 33 - “Seek first God’s kingdom and what God wants. Then all your other needs will be met as well.” Anything that comes before God in our lives, anything we place on par with Him, anything that threatens our allegiance, bends our will, or weakens our love for God and neighbour threatens not just our space and our schedule but our very souls. What would it look like to invite God—the One who made you, the One who loves you—to order your life? To set your priorities? What would happen if you put Him first and let Him sort out the rest? That itself is a life changing decision. When we put God first, giving Him control, we don’t give Him anything He doesn’t already have. But it is in giving up to God what is always and already His that we begin to be transformed.
Talk to The King:
Father God, help me seek You first in my life. Help me let You take care of my life. In Jesus name, Amen.