నిమ్మళమైన తలంపులు :
1 రాజులు 19:12 - "ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను".
నీ జీవితంలో మౌనం, విరామం సంతరించుకున్నప్పుడు ఇంతకు మునుపెన్నడూ వినలేనిది ఏదైనా నీవు వినియున్నావా? జీవితం ఒక్కసారిగా నిమ్మళంగా ఉన్నప్పుడు మునుపెన్నడూ మనము గ్రహించని, గుర్తించని సంఘటనలు మన హృదయాన్ని తాకుతాయి. గందరగోళంతో నిండిన ఈ ఐహికమైన ప్రపంచం నుండి మనం దూరంగా వచ్చినప్పుడు మనకు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే దేవునికి మనం చేరువ కాగలము. దేవుడు నీతో పలికే మాటలు నీకు వినబడతాయి. దేవునితో నీవు గొప్ప సన్నిధిని కలిగియుండగలవు. గనుక నీ జీవితంలో ఏవైతే నిన్ను దేవుని వైపు నడచుటకు ఆటంకపరుస్తున్నాయో వాటినుంచి దూరంగా రమ్ము.
ప్రార్థనా మనవి:
ప్రియమైన పరలోక తండ్రి!!! నన్ను ఇహలోక గందరగోళం నుంచి తప్పించి మనసుని నిమ్మళపరచుము. మౌనంగా నిన్ను కనిపెట్టుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.
Quieter Thoughts:
I Kings 19:12-“but the Lord was not in the fire; and after the fire a still small voice.” As space and silence open up in your life, what can you hear that you couldn’t before? As life becomes quieter, you will be shocked to hear all the previously unnoticed things. Silence and running away from worldly chaos lets you hear God. Holy whispers abound when we begin conversing with God on a daily, hourly, minute-by-minute basis, bringing Him into our struggles, offering up our sadness, remembering that He is the source of all our joy. Let us tune in and talk back, reveling in holy whispers that will grow easier to hear as our ears become ever more attuned to Him.
Talk to The King:
Father God, help me put aside all the worldly chaos aside and quieten my life with less noise so that I can hear You. Help me listen to You. In Jesus name, Amen.