Day 182 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్దించును (లూకా 1:45).

నా మాటలు వాటికాలమందు నెరవేరును (లూకా 1:20).

ఈ విషయాలు నీ కళ్ళెదుట జరుగుతాయి
ఎదురుచూసిన మనసా, నువ్వు కోరుకున్నవి
ఆశతో అంటి పెట్టుకుని కని పెట్టినవి
జరుగుతాయని దేవుడో మాట ఇచ్చినవి
మనసుకి తెలుసు సందేహం వలదని
మాట ఇస్తే చాలు జరిగినట్టే అవి.

ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి
అలసిన మనసా, విశ్రమించు దేవుని ఒడిలో
ఆయన రెక్కల నీడలో హాయిగా పవళించు
ఎదురుచూసే కళ్ళు దేవుణ్ణి చూడాలి
నీ భారాన్ని ఆయన మీద వేస్తే
నీకు ఆనందమే మిగలాలి.

ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి
వేసారిన మనసా, ప్రార్థించు, సంతోషించు
రోజంతా మబ్బుకమ్మి వాన కురిసి వేధించినా
సంజెపొద్దు వాలేసరికి గుడిగంటలు మోగుతాయి
అనుమానపు పొగమంచు రాత్రిపై తెర కప్పితే
మినుకుమనే తారల్ని చూపుతుంది విశ్వాసం.

ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి
నమ్మిన మనసా, దేవుడు చెప్పాడు నీకు
విశ్వాసం, నిరీక్షణ లేచి రెక్కలు దులుపుకొని
పసిడి కిరణాల రవి వైపు రివ్వున ఎగిరిపోనీ
గులాబి ఉదయపు ద్వారాలు పిలిచినై
రాత్రిలో కనబడని సంతోషాలు కనబడినై.

దారులన్నీ మూసుకుపోయినా మనకి వచ్చిన వాగ్దానాలు నెరవేరేదాకా ఎదురు చూడాలి. "దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి" (2 కొరింథీ 1:20). .