Day 2 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరీ వెడల్పుగా పెరిగెను, పైకెక్కిన కొలది మందిరము చుట్టునున్న ఈ మేడగదిల అంతస్తులు మరి వెడల్పగుచుండెను గనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండెను. పైకెక్కినకొలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండెను. (యేహెజ్కేలు 41:7).

పైకి పైపైకి సాగిపో పైకి
ప్రార్ధనలో ఆరాధనలో
రోజులు సంవత్సరాలు
కాలాలు గతిస్తూ ఉంటె
పైకి పైపైకి ప్రతి యేడు
అలయక సొలయక
మెట్లెక్కుతూ అడుగులేస్తూ
రక్షకుడి వెంట

పైపైకి ఆత్మలో సాగిపో
కష్టాలు రాని నష్టాలు రాని
శోకాలు గుండెల్ని చీల్చనీ
శోదనలే సోపానాలు క్రిస్తులో
పైకి పైపైకి ఉదయమయ్యేదాకా
నీడలు కరిగేదాకా
స్వర్ణ ద్వారాలు పిలిచేదాకా
స్వర్ణ సింహాసనం ఎదుట నేలిచేదాకా

పర్వత శిఖరం మనల్ని పిలుస్తుంటే లోయల్లోని పొగమంచులో ఆగిపోకూడదు. కొండలపై కురిసే మంచు పర్వతాలెంత స్వచ్ఛమైనవి! కొండగాలి ఎంత పరిశుభ్రమైనది! అక్కడ నివసించేవాళ్ళు దేవునికి సమీపంగా ఉంటారు. చాలామంది విశ్వాసులు బొగ్గు గనుల్లో, మూసుకుపోయిన ప్రదేశాల్లో జీవితమంతా గడిపేస్తారు. వాళ్లు సూర్య కాంతిని చూడడానికి నోచుకోరు. పరమతైలంతో అభిషేకించవలసిన వాళ్ల ముఖం మీద కన్నీటి చారికలు తప్ప మరేమీ కనిపించవు. చాలామంది విశ్వాసులు అంతపురం మీద నడిచే బదులు చీకటికోట్లలో జీవితాలు గడుపుతారు. విశ్వాసీ, నీ దీనస్థితి నుండి మేలుకో. నీ బద్దకాన్ని, మత్తుని, జడత్వాన్ని,చల్లారిపోయి చప్పబడిన ఆత్మని, క్రీస్తు యొక్క పరిశుద్ద ప్రేమ నుండి నిన్ను ఎడబాపే మరి దేనినైనా వదిలించుకో. నీ జీవితానికి ఆయనే పరిధి, జన్మస్థానం, కేంద్రబిందువు, సంతోషకిరణం, మరుగుజ్జు విజయాలతో సంతృప్తి చెందకు. ఇంకా ఉన్నతమైన, సంపూర్ణమైన జీవితాన్ని ఆశించు, పరలోకం వైపుకి దేవునికి దగ్గరగా సాగిపో.

ఉన్నత శికరాన్నేక్కాలి
ఉజ్వల మహిమోదయం చూడాలి
పరలోకం కనిపించేదాకా ప్రార్దించాలి
దేవా, నీవే పైకి నడిపించాలి

మనలో చాలామంది గడపవలసినంత ఆశీర్వాదకరమైన జీవితం గడపడంలేదు, మనం కొండలెక్కడానికి సంకోచించి కిందనే ఉండిపోతున్నాం. ఆ కొండల గాంభీర్యం, ఎత్తు మనల్ని కంగారుపెడుతున్నాయి. అందుకని లోయల్లో, పొగ మంచుల్లో నిలిచిపోతున్నాం. కొండ శిఖరాలపైన మర్మమైన విషయాలు మనకి తెలియడం లేదు. ఇలా మనం సోమరితనంగా ఉండడంవల్ల మనకి కలిగే నష్టం మనకర్థం కావడం లేదు. ఆ కొండ లెక్కగలిగే ధైర్యం ఉంటే ఎంతటి మహిమ మన కోసం వేచి ఉందో, ఎన్ని ఆశీర్వాదాలు ఎదురుచూస్తున్నాయో కళ్లారా చూడగలం.