Day 6 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీమీద పొర్లిపారవు ( యెషయా 43:2).

మన మార్గానికి ముందుగా దేవుడుదారిని సిద్ధం చేయడు. సహాయం అవసరం కాకముందే సహాయం చేస్తానని మాట ఇవ్వడు. అడ్డంకులు ఇంకా మనకి ఎదురు కాకముందే వాటిని తొలగించడు గాని, మనకి అవసరం ముంచుకు వచ్చినప్పుడు మాత్రమే తన చెయ్యి చాపుతాడు.
చాలామందికి ఈ విషయం తెలియదు. భవిష్యత్తులో తమకి వస్తాయనుకున్న కష్టాల గురించి ఇప్పటి నుంచే ఆందోళన పడుతూ ఉంటారు. తమ కనుచూపుమేర మైళ్ళ తరబడి దారిని దేవుడు ముందుగానే సాఫీచేసి ఉంచాలని వాళ్ళ కోరిక. అయితే ఆయనేమో వాళ్ళ అవసరానికి తగినట్టుగా ఒక్కొక్క అడుగు చదును చేస్తానంటున్నాడు." మిమ్మల్ని నదులు దాటిస్తాను" అన్న ఆయన ప్రమాణాన్ని మనపట్ల నిజం చేసుకోవాలంటే మనం నీటిలోకి దిగి దాని ప్రవాహంలోకి వెళ్లిపోవాలి. చాలామందికి చావంటే భయం. చిరునవ్వుతో చనిపోయే ధైర్యం మాకు లేదు అంటూ అంగలారుస్తూరు. అలాంటి దైర్యం, అసలు అవసరం. ఎందుకంటే వాళ్లు తమని తాము ఆరోగ్యవంతులుగా ఉంచుకుంటూ దైనందిన కార్యాల్లో పాల్గొంటూ ఉంటే చావు ఎప్పుడో వచ్చే ఒక నీడ మాత్రమే. ముందుగా కావలసింది ప్రస్తుతం మన విధుల్ని నిర్వర్తించడానికి, బ్రతకడానికి ధైర్యం. అది ఉంటే చావడానికి ధైర్యంకూడా దానంతట అదే వస్తుంది.

నదిలోనికి నీవు నడిచి వెళ్తున్నప్పుడు
జల్లుమనేలా నీళ్ళు చల్లగా తగలోచ్చు
కష్టాల కడలిలో శోధనాతరంగాలు
విషవేదన ఓపలేని బాధ మనసునీ,ఆత్మనీ
మదన పెట్టి ముంచెత్తితే
అవి నీ తలమీదుగా పొర్లి ప్రవహించవు
నీటిలో నడిచి వెళ్ళే వేళ
నిజంగా నువ్వు మునిగిపోవు

నమ్మదగిన దేవుని వాగ్దానాలు
నీనుంచి ఎప్పుడుదూరం కావు
కెరటాలు పరవళ్ళు దేవునీవే
తీరం చేర్చే పదవలూ ఆయనవే