ఎస్తేరు గ్రంథముతో పాతనిబంధన గ్రంథము యొక్క చారిత్రిక గ్రంథములు ముగియుచున్నవి. దీనికి ప్రక్కనున్న పద్య భాగములో మనము చూచుచున్న అయిదు కావ్య గ్రంథములలో మొట్టమొదటిది యోబు గ్రంథము. కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు మొదలైనవి ఇతర నాలుగు పద్య గ్రంథములు. అతి ప్రాచీనమో, ఆధునీకమైన సాహిత్య కృతుల సమూహములో అతి శ్రేష్టమైన కావ్య గ్రంథము యోబు గ్రంథమేనని టెన్నిసన్ అనునతడు చెప్పెను. పరిశుద్ధ గ్రంథములోనే ఎంతో పాత గ్రంథము యోబు గ్రంథమే.
ఉద్దేశము : నిజమైన విశ్వాసము యొక్క కర్తవ్యమును దేవుని ఉన్నతమైన అధికారమును ప్రత్యక్ష పరచుట.
గ్రంథకర్త : యోబు
కాలము : 2000 - 1880 క్రీ.పూ
పూర్వ చరిత్ర : ఊజు దేశము (పాలస్తీనాలోని ఉత్తర సరిహద్దులో దమస్కునకు యూప్రటీసు నదికిని మధ్య భాగములో నున్న అరణ్యములోనున్న స్థల మైయుండవచ్చును.)
ముఖ్య మనుష్యులు : యోబు, తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడగు బిల్టదు, నయమాతీయుడైన జోఫరు, రాము వంశస్థుడైన బూజీయుడుగు ఎలీహు.
విశేష కార్యములు : హెబ్రీ పరిశుద్ధ గ్రంథములో పద్య భాగములో మొట్టమొదటిగా యోబు గ్రంథము మొదటిస్థానము వహించినది. పరిశుద్ధ గ్రంథములో అతి ప్రాచీనమైనదిగా ఈ గ్రంథము పరిగణింపబడుచున్నది. సాతాను యొక్క క్రియలను గూర్చి లోతైన దృష్టి ఈ గ్రంథములో మనికివ్వబడుచున్నది. యెహెఙ్కేలు 14:14-20 యాకోబు 5:11 మొదలైన వచనములు యోబు ఒక చారిత్రక మానవునిగా చిత్రించుచున్నవి.
ముఖ్యమైన మాట : దేవుని యొక్క పరిపూర్ణమైన అధికారము: శ్రమలలో కూడా యోబు నేర్చుకొను పాఠము దేవుని పూర్ణమైన అధికారమును గూర్చినదైయున్నది. విశ్వాసుల యొక్క విషయములో అది అలాగే యున్నది.
ముఖ్యమైన వచనములు : యోబు 13:15; యోబు 37:23-24
ముఖ్యమైన అధ్యాయము : యోబు 42. గ్రంథము యొక్క ఈ చివరి అధ్యాయము యోబుకు తనతోను, భార్యతోను, స్నేహితులతోను, దేవునితోను జరిగిన పోరాటము యొక్క ఉన్నత స్థితిని చూపించుచున్నది. దేవుని పరిపూర్ణ మహాత్యమును సర్వ ఆధిపత్యమును అంగీకరించుటతో యోబుకు మానసిక పరివర్తనం సంభవించుచుండెను. ఆయనను కలత జెందించుచుండిన ఎందుకు అను ప్రశ్న తరువాత ఆయనకు సమస్యగా కనిపించలేదు.
విభాగము : గ్రంథమును మూడు భాగములుగా విభజింపవచ్చును. యోబు యొక్క దుఃఖములు, యోబుకు స్నేహితులకు జరిగిన వివాదము. ఆయనకు దొరికిన విడుదల మొదలైనవి ఈ మూడు భాగములు. ఒక్కొక్క దాని అంతర్భావములు ఈ క్రింద ఇవ్వబడియున్నవి.
(1): యోబు దుఃఖములు : Job,1,1-2,13. 1). యోబు యొక్క కుటుంబ చరిత్ర యోబు 1:1-5. 2). సాతాను మొదటి ముట్టడి యోబు 1:6-22. 3). సాతాను రెండవ ముట్టడి యోబు 2:1-10. 4). యోబు స్నేహితుల రాక యోబు 2:11-13
(2). యోబుకును స్నేహితులకు జరిగిన వాదోపవాద క్రమము : Job,3,1-37,24. 1). యోబు యొక్క మొదటి పలుకు Job,3,1-26. 2), ఎలీఫజు యొక్క పలుకులు, యోబు జవాబు Job,4,1-5,27. 3). బిల్దదు పలుకులు, యోబు జవాబును Job,8,1-10,22 4). జోఫరు పలుకులు, యోబు జవాబు Job,11,1-14,32. 5). ఎలీఫజు యొక్క రెండవ పలుకలుక జవాబును Job,15,1-16,17. 6). బిల్టదు పలుకులు యోబు జవాబును Job,18,1-19,29. 7). జోఫరు రెండవ పలుకులు యోబు జవాబు Job,20,1-21,34. 8). ఎలీఫజు మూడవ పలుకులు యోబు జవాబు Job,22,1-24,25. 9). బిల్దదు పలుకులును, జవాబులును Job,25,1-26,14. 10). యోబు చివరి వాదము Job,27,1-31,40. 11). ఎలీహు జవాబు Job,32,1-37,24.
(3). యోబుకు దొరుకు విడుదల , Job,38,1-42,17 1). యోబుకు దేవుడిచ్చే జవాబు Job,38,1-41,34 2). యోబు తన అమాయత్వమును సమ్మతించుట - స్వనీతి కొరకు పశ్చాత్తాపపడు యోబు Job,42,1-6. 3). యోబుకు దొరికిన విడుదల Job,42,7-17.
a). తన స్నేహితుల కొరకు యోబు విజ్ఞాపన చేయుచున్నాడు Job,42,7-10.
b). యోబు తాను పోగొట్టుకొన్న వాటికన్నిటికి రెండింతలు తిరిగి పొందుచున్నాడు Job,42,11-17.
యోబును కలత జెందించిన సమస్యలకు జవాబు {Job,42,5-6 వచనములలోనున్నది. ప్రతి దుఃఖమునకు ఉద్దేశము అదే. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తనేను వింటిని అయితే యిప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను, బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.
కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 18వ గ్రంథము; అధ్యాయములు 42; వచనములు 1070; చరిత్రాత్మిక వచనములు 1066; నెరవేరిన ప్రవచనములు 1; నెరవేరని ప్రవచనములు 3; ప్రశ్నలు 329; ఆజ్ఞలు 13; వాగ్దానములు లేవు; హెచ్చరికలు 4; దేవుని యెద్ద నుండి ప్రత్యేకమైన వర్తమానములు 10.