అనేక బృందములును తూర్పు దేశము యొక్క వాజ్మయశైలిలో అమర్చబడిన చిత్రపటములతో నిండిన ఒక ప్రేమ కవిత్వముగా పరమగీతము ఉంటున్నది. చరిత్ర రీతిగా చూచినట్లయితే సొలొమోను రాజునకును, ఒక కాపరి సంతతికి చెందిన కన్యకును మధ్య గల ప్రేమను, వివాహమును చిత్రించే ఒక గ్రంథముగాను, మరియొక రీతిగా చూస్తే ఇశ్రాయేలు దేవుని యొక్క పవిత్రమైన పెండ్లి కుమార్తెగాను, సంఘము యేసుక్రీస్తు
యొక్క పెండ్లి కుమార్తెగాను చిత్రించే ఒక గ్రంథముగా దీనిని పరిగణించవచ్చును. మానవుని ఆత్మీయ జీవితము యొక్క గొప్ప సమృద్ధి దేవునికిని మానవునికి అనగా క్రీస్తుకును మానవ ఆత్మకును మధ్యనున్న ప్రేమగల సంబంధమే.
అనేక సాక్షులతో నిండిన ఒక నాటకము యొక్క శైలిలో ఈ గ్రంథమున్నది. సొలొమోను రాజు (నాయకుడు) షూలమ్మితీ (నాయకురాలు) యెరూషలేము కుమార్తెలు (పాటల బృందము) వీరే దీని యొక్క ఈ కథా పాత్రలు. హెబ్రీ, గ్రీకు భాషలలో నున్న గ్రంథముల పేర్లు పాటల యొక్క పాటలు అనగా పరమగీతములు అనునదే. సొలొమోను రచించిన 1005 పాటలను గూర్చి 1 రాజులు 4:32 లో చెప్పబడియున్నది. వాటిలో ఎంతో శ్రేష్టమైన పాట అనుబావము ఇచ్చుటచే పరమగీతము అను పేరు అర్థముతో నిండినదిగానున్నది. ముప్పది సంవత్సరములకు లోబడిన వారు చదువుటకు ధర్మశాస్త్రో పదేశకులు, పెద్దలు దీనిని అనుమతించలేదు.
గ్రంథకర్త : సొలొమోను
కాలము : సొలొమోను పరిపాలన కాలము యొక్క ప్రారంభము అనగా దాదాపు 965లో వ్రాయబడినదని ఊహించవచ్చును.
ముఖ్యమైన మాట : ప్రేమ
ముఖ్యవచనములు : పరమగీతము 7:11; పరమగీతము 8:7 నేను నా ప్రియుని దానను. అతడు నా యందు ఆశాబద్దుడు (పరమగీతము 7:11). అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు ప్రేమకై యొకడు తన స్వాస్థ్యమంతా యిచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. (పరమగీతము 8:7).
ముఖ్యమైన అధ్యాయములు : గ్రంథమంతయు కవిత్వముతో నిండియున్నందున ఏదైన ఒక అధ్యాయమునకు శ్రేష్టతనిచ్చుటకు వీలుపడదు. 8 అధ్యాయములు కుటుంబ ప్రేమను ఎంతో చక్కగా బోధించుచున్నవి.
గ్రంథ విభాగములు : ఈ గ్రంథమునకు మూడు ముఖ్యమైన భాగములున్నవని చెప్పగలము.
(1). ప్రేమ ప్రారంభము Song,1,1-3,5 వరకు
- పెండ్లి కమార్తె యొక్క ప్రేమాకాంక్ష పరమగీతము 1:1-8
- ఒకరికొకరు తమ ప్రేమను బయలుపరచుట Song,1,9-2,7
- రాజు పెండ్లి కుమార్తె యింటిలో పరమగీతము 2:8-17
- పెండ్లి కుమార్తె యొక్క ఎడబాటు కల పరమగీతము 3:1-5
(2). ప్రేమ వివాహములో సఫలమయ్యెను Song,3,6-5,1
- వివాహ ఊరేగింపు పరమగీతము 3:6-11
- పెండ్లికుమార్తె యొక్క విశేషమైన అందము పరమగీతము 4:1-15
- వివాహము యొక్క ఆనందం Song,4,16-5,1
(3). ప్రేమాభివృద్ధి Song,5,2-8,14
- పెండ్లి కుమార్తె యొక్క రెండవ ఎడబాటు కల పరమగీతము 5:2-7
- పెండ్లి కుమారుని విశేషమైన అందము Song,5,8-6,3
- పెండ్లికుమార్తె యొక్క అందమును పొగడబడుట Song,6,4-7,10
- తన యింటికి వెళ్ళుటకు పెండ్లి కుమార్తె వాంచ Song,7,11-8,4
- ప్రయాణమైయింటిని చేరుకొనుట పరమగీతము 8:5-14
కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 22వ గ్రంథము ; అధ్యాయములు 8; వచనములు 117; ప్రశ్నలు 13; ఆజ్ఞలు 14; ప్రవచనములు లేవు; దేవుని యొద్ద నుండి విశేష వర్తమానములు లేవు.