~ ఈరోజు నీ మనసు ఏదో భారమును కలిగియుండి నీయాత్మను పలు దిక్కులవైపు లాగి అలిసిపోయేలా చేస్తూ ఉండవచ్చు.
~ కానీ ప్రియులారా, దేవునికి మనము బలహీనులమని అన్నీ సమస్యలు ఒకేసారి ఎదుర్కోలేమని తెలుసు గనుక ఆయన మనకు సహాయము చేయుదునని వాగ్దానము చేసియున్నారు.
~ ఆయన యొక్క శక్తికి అపరిమతము. ఆయనకు అసాధ్యమైనదేదియూ లేదు.
~ మనకు సహాయం చేయుటలో మనకు అవసరమైనవి దయచేయుటలో ఆయన ఎంతో సంతోషాన్ని కలిగియున్నాడు.
~ గనుక ఆయన నామములో విశ్వాసముంచి నేడే మన భారములన్నీ ఆయన చేతులకు అప్పగించెదము.
కీర్తనలు 55:22- “నీ భారము యెహోవామీద మోపుము; ఆయనే నిన్ను ఆదుకొనును.”
ప్రార్థన:
పరలోక తండ్రి!!! నా భారములన్నీ నీ చేతులకు అప్పగించుచున్నాను నాకు విశ్రాంతిని అనుగ్రహించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.