~ మన చిన్నప్పుటినుండి మనమేదైనా మంచి పని చేసినప్పుడు ప్రశంసింపబడతున్నాము ఏదైనా తప్పు చేస్తే అది సరిదిద్దుకునేంత వరకు విమర్శింపబడతున్నాము.
~ మనము చేసే పనులు దేవుని అనుగ్రహం మీద
ప్రభావమును చూపుతాయి. అందుకే దేవుని కృపను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా మారింది.
~ క్రీస్తు తన మహిమను విడిచి మనుష్యులు ఏర్పరచుకున్న నియమాలను చెరిపి వేయడానికి మన కొఱకు సిలువలో తన ప్రాణమును పెట్టుట చేత దేవుని కృపకు మనలను పాత్రులుగా చేసెను.
~ ఆయన సిలువ మరణము తండ్రి ప్రేమకు మనలను పాత్రులుగా చేసింది.
~ గనుక యేసునామమునందు విశ్వాసముంచుట గాక మనమింక ఏమి చేయవలసిన అవసరం లేదు.
ధ్యానించు:
ఎఫెసీయులకు 2:8- “మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు.”
ప్రార్థన:
ప్రియమైన తండ్రి!!! నీ అద్వితీయ కుమారుని మా కొఱకు సిలువలో బలియాగముగా చేసి దేవుని కృపకు పాత్రులుగా చేసినందుకు నీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము, ఆమేన్.