~ మన జీవితాలు సాఫీగా సాగిపోతున్నప్పుడు దేవుని ప్రార్థించడం, స్తుతించడం, ఆయనకు కృతజ్ఞత చూపించడం, ఆయనయందు ఆనందించడం... ఇవన్నీ కూడా సులువే.
~ కానీ మనము శ్రమలు అనుభవించి వాటి ద్వారా నలిగిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి.
~ నీవు శ్రమలను అనుభవించబోవుచున్నావని యేసుకు తెలుసు మరియు దానికి విరుగుడు దేవుని మరింతగా స్తుతించడమే.
~ స్తుతి మనలను ఆయన సన్నిధివైపు నడిపిస్తుంది. ఆయన వాగ్దానములను జ్ఞాపకం చేసి మనలను బలపరుస్తుంది.
~ అన్నింటికన్నా ముఖ్యంగా ఆయన మనలను ప్రేమించుచున్నాడు. మనకొఱకు ప్రాణం పెట్టాడు. గనుక ఆయనయందు ఆనందించడానికి ఇవి సరైన కారణాలు.
ధ్యానించు:
1 థెస్సలొనీకయులకు 5:15 - “ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి.”
ప్రార్థన:
ప్రియమైన తండ్రి!!! సిలువలో నీవు నా కొఱకు చేసిన గొప్ప త్యాగమును బట్టి నీకు మనఃపూర్వక వందనములు సమర్పించుకొనుచున్నాము, ఆమేన్.