~ ఒక రోజు చివర్లో ఈరోజంతా మనమేమి చేసామని ఆలోచిస్తే ఏదైనా చేసియుండాల్సింది లేదా కాస్త భిన్నంగా చేయాల్సింది అని ఏదోక సందర్భంలో అనిపిస్తుంది.
~ అందువలన నీ ఆత్మ నీరుగారిపోవచ్చు. మళ్ళీ మొదలుపెడదాం..అని నీవు అనుకొనవచ్చు. నీవు చేయగలవు.
~ ప్రతీ ఉదయం... దేవుని కృప మరియు ప్రేమ నిన్ను క్రొత్త ఆరంభం వైపు నడిపిస్తాయి.
~ నిన్ను మరియు నిన్నటి బాధలు ముగిసిపోయాయి. కానీ ఆయన ప్రేమ, విశ్వాస్యత నిత్యం మనకొఱకు ప్రకాశిస్తూ ఉంటాయి.
ధ్యానించు: విలాపవాక్యములు 3:22-23 - “ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది.”
ప్రార్థన:
పరలోక తండ్రి!! నీ యొక్క అపరిమిత ప్రేమను బట్టి నీకు వందనములు. నీ కృపతో నిత్యం నాకు తోడైయుండుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.