ఆత్మీయ ఆహారం కొరకు పరితపించుడి


  • Author: UFC
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

~ మన శరీర ఆరోగ్యానికి, పోషణకు మరియు తృప్తికి ఎలా అయితే ఆయన మనకు ఆహారమును అనుగ్రహించాడో అలాగే మన ఆత్మలకు తన వాక్యమును అనుగ్రహించాడు. అదే పరిశుద్ధ గ్రంథము.

~ మన ఆయన వాక్యమును గూర్చి ఎంతో జిజ్ఞాస కలిగియుండాలి. ఆయన వాక్యము కేవలం ఒక పుస్తకము కాదు. అది జీవగ్రంథము, గ్రంథరాజము. మనలను సత్యము వైపు, నిత్యజీవము వైపు నడిపించే ఏకైక మార్గము.

~ దేవుని వాక్యము ఎంత ఘనమైనదో మనము గ్రహించినప్పుడు అది మన జీవితాల్లో ఎంతో అవశ్యమో మనకు అర్థమవుతుంది.

~ మన ప్రతీ అవసరతలో మనకు ఆయన వాక్యము ఎంతో అవసరమని ఆయన తలంచి మనకు పరిశుద్ధ గ్రంథమును దయచేసాడు.

~ వాక్యమును హత్తుకొనుట ద్వారా మన పరమతండ్రి మనకతో మాట్లాడతాడు, బోధిస్తాడు. మనలను చేయి పట్టుకొని నడిపిస్తాడు. మనలను ఇంకా వృద్ధి పరుస్తాడు.


ధ్యానించు: ద్వితీయోపదేశకాండము 8:3- “ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురు.”


ప్రార్థన:
ప్రియమైన తండ్రి!!! నీ వాక్యము మా జీవితంలో ఎంత అవశ్యమో తెలియజేసినందుకు వందనములు. ఆ వాక్యమును అనుదినం ధ్యానించుచూ, ఇతరులతో పంచుకొని వాక్యానుసారముగా జీవించుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.