గమనించండి: సంఘము ఆనగా దేవుని మందిరము లేదా దేవుని ఇల్లు లేదా సమాజము.
~ దేవుడు మనలను తన రూపమున సృజించెను కానీ మనము ఒంటరిగా ఉండాలని కాదు. ఆయన ఎలాగయితే త్రిత్వమనే బంధాన్ని కలిగియున్నాడో అలాగే మనకొఱకు సంబంధబాంధవ్యాలను కలుగజేసెను.
~ క్రీస్తు విశ్వాసులుగా ఒంటరిగా జీవితాన్ని సాగించడం సబబు కాదనే ఆయన మనకొఱకు సమాజమును కలుగజేసాడు.
~ మనకు ఆత్మీయ సహవాసము ఎంతో అవసరమని మనకు సంఘమును ఏర్పాటు చేసాడు. మన జీవితంలో ఎత్తుపల్లాల ద్వారా మనము సంఘమునుండి ప్రేమను, బలమును పొందుకోగలము.
~ సంఘములోని విశ్వాసులతో సహవాసమును కలిగియుండుట ద్వారా, నిత్యము క్రమం తప్పకుండా సమాజముగా కూడుకొనుట ద్వారా మన ఆత్మీయజీవితాలు బలపడతాయి. మనము ఆత్మీయ జీవితంలో బలపడేందుకే మన తండ్రియైన దేవుడు సంఘమును ఒక సాధనముగా దయచేసాడు.
ధ్యానించు: హెబ్రీయులకు 10:24-25 “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక యుండుడి.”
ప్రార్థన:
ప్రియమైన తండ్రి!!! సంఘ కార్యక్రమములందు చురుకుగా ఉండి సంఘము కొఱకు పాటుపడుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.