~ యేసుక్రీస్తు జననం అకస్మాత్తుగా సంభవించినది కాదు. ఆయన యొక్క జననము గురించి ఎప్పుడో ప్రవచింపబడింది. ఆయన జననం ప్రవచన నెరవేర్పు.
~ ఆయన జన్మించడానికి ఎన్నో సంవత్సరాల క్రిందటే ఆయన యొక్క వంశావళి నిర్ణయించబడింది. యోసేపు యూదా గోత్రపు వాడని, తల్లియైన మరియ అహరోను వంశీకురాలని ముందే నిర్ణయించబడింది. అందుకే గొఱ్ఱెపిల్లగా మరియు ప్రధానయాజకునిగా
తన బాధ్యతను నిర్వర్తించాడు.
~ ఆయన బెత్లేహేమనే ఒక చిన్న గ్రామంలో ఫలానా కాలములో ఫలానా సమయమందు పశువులపాకలో జన్మిస్తాడని మరియు ఆయన జన్మము గూర్చి గొఱ్ఱెలకాపరులు చాటించెదరని కూడా వ్రాయబడింది.
~ గనుక ఈరోజు యేసుక్రీస్తు జన్మమును గురించిన ప్రవచనములన్నీ ధ్యానించెదము. మన రక్షకుడైన యేసుని గూర్చి వాగ్దానము చేసి నేరవేర్చిన పరమదేవుని ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించెదము.
ధ్యానించు:
మీకా 5:2- “బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును.”
ప్రార్థన:
ప్రియ పరలోకతండ్రి!!! ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తుని జన్మమును గూర్చిన వాగ్దానమును, ప్రవచనమును నెరవేర్చినందుకు మీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము, ఆమేన్.