మన జీవితాలపై దేవుని పిలుపును నెరవేర్చడం, వ్యక్తిగతంగా మనము సాధించాము అని కాదు గాని. ఆ పిలుపు పట్ల విధేయత కనుపరచడమే.
మనము చేసే కార్యములు ఎవరూ చూడకపోయినా దేవుడు దానిని గమనిస్తూనే ఉంటాడు. నిజంగా, గుర్తింపు లేకుండా ఏదైనా చేయాలంటే బాధగానే ఉన్నా, దేవునినుండి ప్రతిఫలము పొందగలము అనే నిరీక్షణకలికి విధేయతతో పరిచర్య చేయడమే దేవుని ఉద్దేశము.
ధ్యానించు:
సామెతలు 15:3- “యెహోవా కన్నులు ప్రతి స్థలముమీదనుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.”
ప్రార్థన:
ప్రియ పరలోకతండ్రి!!! ఈ లోకాశలను జయించి నీయందు నా గురిని నిలుపుటకు సహాయము చేయుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్.