✓మన జీవితాల్లో సంతోషము ఆనందమును దాయజేయవలెనని యేసు క్రీస్తు దీనుడుగా ఈ లోకంలో జన్మించడం తండ్రికి ఆయన చూపిన విధేయత.
✓మనము చేయలేని పరిచర్య ఇతరులు చేసినప్పుడు వారిని ప్రోత్సాహించడం మన బాధ్యత.
ఇతరులు ఆశీర్వదించబడినప్పుడు వారియెడల అసూయపడక వారి సంతోషములో పాలుపొందడం దేవునికి మనము చూపించే విధేయత.
✓మనము పొందిన సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటూ, ఇతరుల సంతోషాలలో పాలుపొందడమే నిజమైన క్రిస్మస్.
లూకా 15:9- “నాతోకూడ సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరకినది.”
ప్రార్థన:
ప్రియమైన తండ్రి! నీ పనిలో నేనున్నా లేకున్నా ప్రతీ విధముగా సంతోషించుటకు, నీ పరిచర్యలో యూన్నవారిని ప్రోత్సాహిస్తూ వారి సంతోషములో నేనును పాలు పొందులాగున నాకు సహాయము చేయుము, ఆమేన్.