✓ దేవుని వాగ్దానములు మనుష్యుల జ్ఞానమును మించి ఘనమైనవిగా ఉంటాయి.
✓ అసాధ్యుడైన దేవుని మనము సేవించుచున్నాము. మన ఆలోచనకు పరిమితులు ఉన్నాయి కానీ ఆయనకు ఎలాంటి పరిమితులు లేవు.
✓ ఆయన యొక్క చిత్తమును సిద్ధింపజేసి దాని విషయమై ఆనందిస్తాడు.
✓ సందేహాన్ని కలిగియున్నంత మాత్రాన విశ్వాస జీవితానికి మనము అసమర్థులము కానేరము.
✓ దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. గనుక ఆయన యొక్క వాగ్దానములందు నమ్మికయుంచి ఆయనను మహిమపరచి ఆయన యొక్క పనిలో పాలివారమవుదము.
ధ్యానించు:
మార్కు 14:36- “నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము.”
ప్రార్థన:
ప్రియమైన తండ్రి!!! నేనెప్పుడయినా నీకయిష్టమైన వాటిపైన నమ్మికయుంచితే నన్ను సరిచేసి నీ మార్గములో నడిపించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.