✓ లోకములో ఎవరు ఎంతటి అధికారమును కలిగియున్ననూ సమస్తమంతటి మీద దేవునికి అధికారము కలదు. ఆయనకు ఉన్న అధికారము మరి ఎవరికినీ లేదు.
✓ పరిస్థితులెలా ఉన్నా మనము ఆయనయందు విశ్వాసముంచగలము. ఫలితమెలా ఉన్నా ఆయన మార్గములయందు మనము నమ్మికయుంచగలము.
✓ ఈరోజు ఆయనయందు కేవలం విశ్వాసముంచుటయే కాదు గానీ మన జీవితాల పట్ల పూర్తి అధికారమును ఆయనకు అప్పగించెదము. ఆయనే మనకు శాంతిని అనుగ్రహించును.
✓ మన జీవితముపై ఆయనకు పూర్తి అధికారమును అప్పగించునట్లు ప్రతీరోజూ ఉదయం నీవు లేచిన వెంటనే కొంత ఏకాంత సమయాన్ని మౌనముగా ప్రార్థనయందు. గడిపెదము.
✓ధ్యానించు:
కీర్తనలు 37:7- “యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము.”
ప్రార్థన:
ప్రియమైన తండ్రి!!! మా జీవితములను పూర్తిగా నీ హస్తములకు అప్పగించుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.