✓ పేరుప్రతిష్టలను సంపాదించాలనే కోరికను మనలను అనూహ్యంగా పాపములో పడవేస్తుంది.
✓ దేవుని మహిమపరచడానికి మనం కలిగిన అవకాశములు మనలను స్వకీర్తి వైపు మళ్ళించవచ్చు.
✓ ఒక లక్ష్యాన్ని కలిగియుండుట మంచిదే గానీ అది మనలను హెచ్చించేదిగా ఉంటే మనము పాపములో చిక్కుకుపోతాము. ఆ పాపమును మనం తీవ్రంగా పరిగణించాల్సి ఉంది.
✓ ఈ లోకపు అధికారం, కీర్తి, పరపతి ఇవేమీ మనకు శాంతిని రక్షణను అందించవు. పాపము చాలా భయంకరమైనది మరియు అది మనలను దేవుని నుండి దూరం చేస్తుంది.
✓ అటువంటి పాపమునుండి దేవుడే మనకు విడుదలను, రక్షణను పరమశాంతిని, అనుగ్రహించువాడు. ఆయన తప్ప వేరే మార్గము లేదు.
✓ధ్యానించు:
మత్తయి 23:12- “తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును.”
ప్రార్థన:
పరలోక తండ్రి!! నేనెన్నోసార్లు నన్ను నేను హెచ్చించుకొని పాపము చేసాను. గనుక నన్ను క్షమించి తగ్గింపు స్వభావమును కలిగియుండుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.