✓ మన శక్తిసామర్థ్యాలను ఆయన పాదాలచెంత ఉంచగలిగితే తన చిత్తమునకు తగినట్లుగా మనలను ఉపయోగించుకుంటాడు. ఆయన పాదాల చెంత పెట్టడమంటే మోకరించి ఆయనకు లోబడియుండటమే.
✓ అట్టి సామర్థ్యాలను నింపిన దేవునిని ఆరాధించి ఆయనకే మొదటి స్థానమివ్వాలి. అనగా నిత్యము ఆయన మహిమార్థమై జీవించుటకు అనుదినము నిశ్చయించుకోవడమే. ఇదే మన జీవన శైలి.
✓ధ్యానించు:
మత్తయి 2:11- “వారు తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించిరి.”
ప్రార్థన:
తండ్రి!!! ఆరాధనా జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని కలిగియుండుటకు నా హృదయం నీ హృదయముతో ఏకీభవించుటకు సహాయము చేయుము. ఆమేన్.