సముద్రంపై రేగిన తుపాను తమను యేసునుండి వేరుచేసిందని శిష్యులు భయపడ్డారు. అంతేకాదు, యేసు తమ గురించి బొత్తిగా మర్చిపోయాడనుకున్నారు. ఇలాటి సమయాల్లోనే కష్టాల ముల్లు గుచ్చుకుంటుంది. "ప్రభువు మాతో ఉంటే ఇది మాకు ఎందుకు సంభవించింది?" దేవుణ్ణి నీకు సమీపంగా తీసుకురావడానికే నీకు ఈ కీడు కలిగింది. యేసును నీ నుండి వేరుచెయ్యడానికి కాదు; నువ్వు ఆయనకు మరింత విశ్వాసంతో మరింత ఆత్రుతగా హత్తుకోవాలనే!
మనల్ని వదిలేసాడన్నట్టు కనిపించిన హృదయాల్లోనే మనల్ని మనం ఆయన చేతుల్లో వదిలి నిశ్చింతగా ఉండాలి. ఆయన మనకి అనుగ్రహించాలనుకున్నప్పుడే మనం వెలుగునూ ఆదరణనూ అనుభవిద్దాము. ఆయన ఇచ్చే బహుమతుల మీద కాదు గాని ఆయన మీదే ఆశపెట్టుకుందాము. విశ్వాసపు రాత్రిలో ఆయన మనల్ని వదిలినప్పుడు ఉక్కిరిబిక్కిరి చేసే ఆ చీకటిలోనే సాగిపోదాం.
భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ... (ఆది 15:12).