ఒక నూతన అధ్యాయాన్ని లిఖిద్దాం


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

గడచిన సంవత్సరం దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలులు చేసినా, చేయకపోయినా మనలను ఈ దినమున సజీవుల లెక్కలో ఉంచాడంటే అంతకంటే ధన్యత ఏముంది? గడచిన సంవత్సరం గతించిపోయిన వారికంటే మనం గొప్పవారం కాకపోయినప్పటికీ దేవుడు మన యెడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని గ్రహించాలి.

366 పేజీల నూతన సంవత్సర పుస్తకానికి మొదటి పేజీలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖిద్దాం. గత సంవత్సర అనుభవాలు ఈ నూతన సంవత్సరంలో విజయాలుగా ఉండాలని ఆశిద్దాం. చేయబోయే ప్రతీ పనిలో, తీసుకునే ప్రతీ నిర్ణయంలో దేవుని ఉద్దేశాలు తెలుసుకొని, ప్రార్ధనలో వాక్యములో నూతన బలము పొందుతూ దేవుని వాగ్ధాన ప్రతిఫలాన్ని పొందుదాం. ఏమి పోగొట్టుకున్నామో విడిచిపెట్టి, ఏమి సాధించాలో వాటిపై దృష్టియుంచి నూతన వాగ్ధానాన్ని పొందిన మనం విజయాపథం వైపు పరుగెడుదాం.

విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. హెబ్రీ 12:2