ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 1 థెస్సలొనీకయులకు 5:16‭

అనుదినము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనే పద్ధతిని అలవరచుకోవడం ద్వారా ఎటువంటి సందర్భాల్లోనైనా మంచిని చూడగలము. అలసిపోయి నిరాశచెందిన సమయాల్లో దేవునికి దూరమై ఎన్నో సార్లు దేవుడిచ్చే బహుమానాలు పోగొట్టుకుంటున్న పరిస్థితులు మనకుండినా! ఈ నూతన సంవత్సరంలో, ప్రతి పరిస్థితిలో అది మేలైనా కీడైనా దేవునికి కృతజ్ఞత చెల్లించగలిగే అలవాటు చేసుకొనుటకు ప్రయత్నిద్దాం. ఏ పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనే అనుభవాన్ని పొంది దేవుడిచ్చు బహుమానాలకు అర్హులమవుదాం.

ప్రయత్నిద్దామా ?