దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు. మత్తయ్యి 5 : 4
మనోభావాలు దెబ్బతిన్నాయనుకున్నప్పుడు, గాయపడినప్పుడు, ప్రేమించినది, అతిగా ప్రేమించినది పోగొట్టుకున్నప్పుడు దుఃఖము కలుగుతుంది. మనం నడుస్తున్న దారిలో, జీవితంలో ప్రేమకు రెక్కలు తొడిగి ఎగరగలినంతమేరా ప్రేమను పంచాలనుకుని విస్తరించే ఆత్మీయత, అనుబంధాలమధ్య వేలెత్తిచూపబడినప్పుడు కులం పేరిట, మతం పేరిట, వర్గ వివక్షతను పొందినప్పుడు గాయపడుతుంటాము. శరీరానికి కలిగేగాయలు, నొప్పి తాత్కాలికమైనదే, గానీ వర్గవివక్షత జీవితమంతా వెంటాడుతుంది.
ధుఃఖాన్ని కన్నీరుగా ప్రదర్శిస్తుంటాము.
దుఃఖము ఓటమికి అనుసంధానము చేస్తుంది.
నిరుత్సాహముతో వున్నవారు హెచ్చింపబడలేరు
ఈ వివక్ష యేసు క్రీస్తుకు తప్పలేదు అది చివరికి సిలువవైపు నడిపింది. సిలువలో ధర్మసాస్త్ర సంబంధమైన ప్రతివాటిని మేకులతో కొట్టబడి ఒక నూతన నిబంధనలోనికి మనలను నడిపించాడు. ఇక దుఃఖము ఎందుకుంటుంది? క్రీస్తులో మనకు ఓదార్పు తప్ప!