ప్రతీ శ్రమలలోను వేదనలోను దేవుడు మనకు తోడైయుంటాడనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి.
° ఇమ్మనుయేలు దేవుని మనం స్తుతించి ఆరాధించడానికి ఇదే నిజమైన కారణం. మనము శ్రమలలో ఉన్నప్పుడు మనలను ఒంటరిగా విడిచిపెట్టి తన ముఖమును మరుగుచేయువాడు కనే కాడు.
నేను నీకు తోడైయుందును. యెషయా 43:2
° ఈ వాక్యమును లోతుగా అధ్యయనం చేసినప్పుడు మన హృదయాలు ఆయనకు దగ్గరవుతాయి.
° ఆయనతో మనము కలిగియున్న సన్నిధి మన హృదయానికి కలిగిన గాయములను అందులోని వేదననుండి స్వస్థత కలుగజేస్తుంది. గనుక దేవుడు.. మనకు కలిగే ప్రతీ వేదనలోను, మనము పొందే ప్రతీ శ్రమలలోను మనకు తోడైయుంటాడనే నమ్మకం మనకుంటే విశ్వాసములో మరింత బలము పొందగలము.
ప్రార్థన:
పరలోక తండ్రి!!! నా చేతిని ఎన్నడూ విడువక నా ప్రతీ శ్రమలోనూ, వేదనలోనూ తోడైయున్నందుకు నిన్ను స్తుతించి మహిమపరిచే భాగ్యమును మాకిమ్మని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.