పట్టణపు వీదులగుండా నేను నడుస్తున్నప్పుడు చేతిలో పక్షులున్న పంజరాన్ని ఊపుకుంటూ నావైపుగా నడిచివస్తున్న ఒక బాలుడిని చూచాను. ఆ పంజరంలో మూడు చిన్న పిట్టలు చలితోను, భయముతోను వణుకుతూ ఉన్నాయి.
నేనా బాలుడుని ఆపి అడిగాను "ఏమి పట్టుకున్నావు బాబు?" అని.
"ఏవో మామూలు పిట్టలు" అని జవాబిచ్చాడా పిల్లవాడు.
"వాటితో ఏమిచేస్తావ్?" అని అడిగాను.
"ఇంటికి తీసుకువెళ్ళి ఆడుకుంటాను" వాటి రెక్కలు లాగుతాను, ఈకలు పీకుతాను, అల్లరి చేస్తాను వాటితో ఆనందంగా గడుపుతాను.
"కాని వాటితో నీవు తొందరగా అలసిపోతావు, మరల మరల ఆడుకోవాలనిపించదు. అప్పుడేమి చేస్తావు?
"ఓహో, అప్పుడు నాదగ్గర పిల్లులున్నాయి. వాటికి పక్షులంటే ఇష్టం వాటికిస్తాను"
కొద్దిసేపు నేను మౌనంగా ఉండి ""ఆ పక్షులకు నీకు ఎంత కావాలి?" అని అడిగాను.
"ఒహ్ ?? !!! మీకు ఎందుకు ఈ పక్షులు, ఇవి కేవలం మామూలు పక్షులు. అవి పాడవు - అందంగా ఉండవు!"
"నీకు ఎంత కావాలి?"
నన్నోక పిచ్చివాడిలా చూసి ఆ బాలుడు, "₹1000?" అన్నాడు
నేను జేబులో నుంచి వెయ్యి రూపాయలు తీసి ఇచ్చిన మరుక్షణం ఆ బాలుడు పక్షులున్న బోను నా చేతిలో పెట్టి తుర్రుమని వెళ్ళిపోయాడు.
నేను ఆ బోను పట్టుకొని అలానే వీదిచివరకు వెళ్ళి పక్షులను బయటకు వదిలివేశాను.
- అసలు, పుల్పిట్ మీద ఖాళీ పక్షి పంజరాన్ని చూపించి పాస్టర్ ఈ కథ చెప్పడం ప్రారంభించాడు.
ఒక రోజు సాతాను యేసుతోసంభాషణ జరుపుతున్నాడు. సాతాను అప్పుడే ఏదేను వనం నుండి వచ్చాడు. వాడు గొప్పలు చెబుతున్నాడు, ప్రగల్భాలు పలుకుతున్నాడు.
"అవునండి, నేను విస్తారమైన ప్రజలతో నిండిన లోకాన్ని పట్టుకున్నాను. ఉచ్చులు అమర్చాను, ఎరను ఉపయోగించాను, వారు కాదనలేరని నాకు తెలుసు, పడ్డారు.
.
"నీవు వారితో ఏమి చేయబోతున్నావు?" అని యేసు అడిగారు
"ఓహ్, నేను ఆనందించబోతున్నాను! ఎలా వివాహం చేసుకోవాలి- విడాకులు తీసుకోవాలో చెబుతాను . ఒకరినొకరు ఎలా ద్వేషించాలి, భాదించాలో చెబుతాను. మద్యం, పొగ త్రాగడం నేర్పిస్తాను. శపించడం, హింసించడం, తుపాకులు ఇంకా బాంబులతో ఒకరినొకరు చంపుకోవడం నేర్పిస్తాను. నిజంగా నేను ఆనందించబోతున్నాను!
"వారితో ఇక నీ ఆటలు అయిపోయిన తరువాత ఏమి చేస్తావు?" అని యేసు అడిగారు.
"వారిని చంపేస్తాను."
"వారికొరకు నీకెంత కావాలి"
"ఓహ్, మీకు ఆ ప్రజలు అక్కరలేదు. వారు మంచివారు కాదు. ఎందుకు వారిని దగ్గర చేర్చుకుంటున్నావు వారు నిన్ను ద్వేషిస్తారు, ఉమ్మివేస్తారు, నిన్ను శపించి చంపేస్తారు !! మీకు అక్కరలేదు ఆ ప్రజలు!!"
"ఎంత?"
సాతాను యేసు వైపు చూస్తూ,వెక్కిరిస్తూ "నీ కన్నీళ్ళు, నీ రక్తం అంతా" అన్నాడు.
యేసు మూల్యం చెల్లించాడు.
"పణంగా పెట్టిన తన ప్రాణం ద్వారా వెలలేని మన జీవితాలకు విలువను చేకూర్చాడు"...
ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను. తీతుకు 2:14