ఆది 5:28,29 లో గమనిస్తే, నెమ్మది అనేది ఎరుగని దినములలో జనులు ఉన్నట్లు తెలుసుకోవచ్చు. లెమేకు ఒక కుమారుని కని, ఇతడు మనకు నెమ్మది కలుగజేస్తాడు అని అనుకొని "నోవహు" అని పేరు పెట్టాడు.
నోవహు నీతిపరుడు... దేవునితో నడచినవాడు.
అంటే?. ఎవరు నీతిగాను, నిందారహితునిగాను ఉంటారో వారినే దేవునితో నడిచేవారు అంటారు.
నీతిపరునిగా ఎలా తీర్చబడుతాము?
లూకా 18:13,14లో సుంకరి దేవుని దగ్గర తనను తాను తగ్గించుకొని, తాను పాపిని అని ఒప్పుకున్నప్పుడు, దేవుని చేత నీతిమంతునిగా తీర్చబడినాడు.
కాని, అనేకులు మనుష్యుల ముందు తగ్గించుకొని, మనుష్యుల చేత మంచివాడు, గొప్పవాడు అని అనిపించుకుంటారు. దేవుని ముందు ఏ పాపం చేయనట్లు ప్రతి పాపమును కప్పుకుంటారు.
మనలో కొందరు సేవకులు కూడా ఇతరులకు వాక్యం చెప్పడానికి వారి తప్పులను చూపించడాకే బైబిల్ చదువుతారు కాని వారి కోసం చదవరు. మాలో ఏ తప్పు లేదన్నట్లు ప్రవర్తిస్తారు. రక్షించబడిన నాడు ఒప్పుకున్న తప్పులే కాదు, రోజూ జరిగే వాటిని కూడా విడిచిపెట్టాలి. ప్రతిరోజు మనకు తెలిసి తెలియక కొందరిని బాధపెట్టవచ్చు.
ఈ కొరింథీయులకు 8:8-13లో మనకున్న విశ్వాసము ద్వారా మన క్రియల ద్వారా బలహీనమైన మనస్సాక్షి గల తోటి సహోదరుని మనసుని నొప్పిస్తే; అని క్రీస్తుకు విరోధముగా పాపము చేసినట్లే కదా.
మనకు నచ్చినది ఇతరులకు నచ్చక పోవచ్చు. అనేకసార్లు దేవునికి విరోధమైన పనులు చేస్తుంటాము. ప్రతిరోజు ఇతరుల కొరకే కాదు, మన జీవితము కొరకు కూడా బైబిల్ చదవాలి, ప్రార్ధన చేయాలి.
ఎవరు దీనులై యదార్ధముగా దేవుని దగ్గర తన పాపములను ఒప్పుకుంటారో వారే నీతిమంతులు.
దేవుని దగ్గర మనలను మనము తగ్గించుకొనినప్పుడే మనము నీతిమంతులముగా తీర్చబడుతాము.
నీతిమంతులుగా జీవించేవారినే దేవునితో నడిచేవారు అంటారు.